WPL 2023 Final: డబ్ల్యూపీఎల్ తొలి విజేతగా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎంతంటే..
టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తుది పోరులోనూ సమష్టి ప్రదర్శనతో అదే జోరును కొనసాగించింది. మార్చి 26న జరిగిన ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నాట్ సివర్ బ్రంట్ (55 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు) నిలిచారు.
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ లీగ్‌లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ.6 కోట్ల ప్రైజ్ మనీని అందించింది. ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ(రూ. 3.4 కోట్లు) కంటే దాదాపు రెట్టింపు. రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజేతల్లో సగం (రూ.3 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది.
WPL 2023 Auction: డబ్ల్యూపీఎల్ వేలంలో భారత వైస్ కెప్టెన్‌కు అత్యధిక మొత్తం
డబ్ల్యూపీఎల్ గణాంకాలు...
అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్) : మెగ్ లానింగ్ (ఢిల్లీ - 345 పరుగులు)
అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్) : హేలీ మాథ్యూస్ (ముంబై - 16 వికెట్లు)
సోఫీ ఎకెల్‌స్టోన్ (యూపీ వారియర్స్ - 16 వికెట్లు)
అత్యధిక వ్యక్తిగత స్కోరు : సోఫీ డివైన్ (ఆర్సీబీ - 99)
అత్యధిక సిక్సర్లు : షెఫాలీ వర్మ (ఢిల్లీ - 13)
బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ : మరియనె కాప్ (ఢిల్లీ) - 5/15 (గుజరాత్ పై)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఈయర్ : యస్తికా భాటియా (ముంబై)
☛ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గెలిచిన వారికి రూ.5 లక్షలు. క్యాచ్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన హర్లీన్ డియోల్‌కు రూ.5 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.
T20 World Cup: ఆరోసారి టి20 ప్రపంచకప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా