Skip to main content

WPL 2023 Auction: డబ్ల్యూపీఎల్‌ వేలంలో భారత వైస్‌ కెప్టెన్‌కు అత్యధిక మొత్తం

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది.

మొత్తం 448 మంది వేలంలోకి రాగా.. ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్‌కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.. యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్‌ 18 మంది చొప్పున తీసుకున్నాయి. వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్‌–10 జాబితాలో భారత్‌ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్‌ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్‌ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్‌ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు. సీనియర్‌ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టు  నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్‌లో అవకాశం దక్కింది. అయితే అండర్‌–19 ప్రపంచకప్‌లో రాణించిన హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్‌ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్‌ డబ్ల్యూపీఎల్‌ వేలంను నిర్వహించింది.  

U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్‌ సాధించిన మ‌హిళ‌లు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..

వేలం విశేషాలు.. 
భారత జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్‌బాష్‌ లీగ్, ‘హండ్రెడ్‌’ లీగ్‌లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్‌పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి. టీమిండియా టాప్‌ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ అయిన యాష్లే గార్డ్‌నర్‌పై కూడా టీమ్‌లు ఆసక్తి చూపించాయి. ఆసీస్‌ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌లకు కూడా మంచి విలువ దక్కింది. మహిళల టి20 క్రికెట్‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్‌ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్‌ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు. భారత కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కోసం గుజరాత్‌ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు.  

Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు

• అసోసియేట్‌ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్‌ తారా నోరిస్‌ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. 
• యూఏఈకి చెందిన మనిక గౌర్‌ కోసం గుజరాత్‌ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.  
• 16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌ పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు.  

• 448 వేలం బరిలో నిలిచిన ప్లేయర్లు 
• 87 అమ్ముడైన మొత్తం ప్లేయర్లు 
• 57 భారత క్రికెటర్లు 
• 30 విదేశీ క్రికెటర్లు 
• రూ.12 కోట్లు ప్లేయర్ల కొనుగోలుకు ఒక్కో ఫ్రాంచైజీకి కేటాయించిన మొత్తం 
• రూ. 59 కోట్ల 50 లక్షలు ఐదు ఫ్రాంచైజీలు కలిసి వెచ్చించిన మొత్తం 
• రూ. 50 లక్షలు వేలం పూర్తయ్యాక మిగిలిన మొత్తం. 
• ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్‌ జట్లు రూ.12 కోట్లు ఖర్చు చేశాయి. 
ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ. 35 లక్షలు.. గుజరాత్‌ జెయింట్స్‌ వద్ద రూ. 5 లక్షలు.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వద్ద రూ. 10 లక్షలు మిగిలిపోయాయి. 

U-19 Women’s T20 World Cup: తొలి అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ విజేత భారత్

తెలుగు అమ్మాయిలు ఆరుగురు.. 
అంజలి శర్వాణి: లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌. కర్నూల్‌ జిల్లా ఆదోని స్వస్థలం. భారత్‌ తరఫున 6 టి20లు మ్యాచ్‌లు ఆడింది.
సబ్బినేని మేఘన: బ్యాటర్, స్వస్థలం విజయవాడ. భారత్‌ తరఫున 3 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడింది.  
షబ్నమ్‌: రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌. స్వస్థలం విశాఖపట్నం. ఇటీవల అండర్‌–19 ప్రపంచకప్‌లో ఆడింది.  
ఎస్‌. యషశ్రీ: పేస్‌ బౌలర్‌. హైదరాబాద్‌ స్వస్థలం. ఇటీవల అండర్‌–19 ప్రపంచ కప్‌లో ఆడింది.   
వి. స్నేహ దీప్తి: బ్యాటర్‌. స్వస్థలం విశాఖపట్నం. భారత్‌ తరఫున 1 వన్డే, 2 టి20లు ఆడింది.  
అరుంధతి రెడ్డి: రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌. స్వస్థలం హైదరాబాద్‌. భారత్‌ తరఫున 26 టి20లు ఆడింది. 

యూపీ వారియర్స్

దీప్తి శర్మ

 రూ.2.60 కోట్లు

సోఫీ ఎకిల్స్టోన్

రూ.1.80 కోట్లు

దేవిక వైద్య

రూ.1.40 కోట్లు

తాహ్లియా మెక్గ్రాత్

రూ.1.40 కోట్లు

షబ్నిమ్ఇస్మాయిల్

రూ.1 కోటి

గ్రేస్హరిస్

రూ.75 లక్షలు

అలీసా హీలీ

రూ.70 లక్షలు

అంజలీ శర్వాణి

రూ.55 లక్షలు

రాజేశ్వరి గైక్వాడ్

రూ.40 లక్షలు

శ్వేత సెహ్రావత్

రూ.40 లక్షలు

కిరణ్నవ్గిరే

రూ.30 లక్షలు

లారెన్బెల్

రూ.30 లక్షలు

లక్ష్మీ యాదవ్

రూ.10 లక్షలు

పార్శవి చోప్రా

రూ.10 లక్షలు

సొప్పదండి యషశ్రీ

రూ.10 లక్షలు

సిమ్రాన్షేక్

రూ.10 లక్షలు

మొత్తం ప్లేయర్లు: 16

విదేశీ ప్లేయర్లు: 6

 

ఢిల్లీ క్యాపిటల్స్

Delhi capitals

జెమిమా రోడ్రిగ్స్

రూ.2.20 కోట్లు

షఫాలీ వర్మ

రూ.2 కోట్లు

మరిజన్కాప్

రూ.1.50 కోట్లు

మెగ్లానింగ్

రూ.1.10 కోట్లు

అలైస్కాప్సీ

రూ.75 లక్షలు

శిఖా పాండే

రూ.60 లక్షలు

జెస్జొనసెన్

రూ.50 లక్షలు

లౌరా హరిస్

రూ.45 లక్షలు

రాధా యాదవ్

రూ.40 లక్షలు

అరుంధతీ రెడ్డి

రూ.30 లక్షలు

మిన్ను మణి

రూ.30 లక్షలు

పూనమ్యాదవ్

రూ.30 లక్షలు

స్నేహ దీప్తి

రూ.30 లక్షలు

తానియా భాటియా

రూ.30 లక్షలు

టిటాస్సాధు

రూ.25 లక్షలు

జాసియా అక్తర్

రూ.20 లక్షలు

అపర్ణ మోండల్

రూ.10 లక్షలు

తారా నోరిస్

రూ.10 లక్షలు

మొత్తం ప్లేయర్లు: 18

విదేశీ ప్లేయర్లు: 6 

గుజరాత్జెయింట్స్

Gujarat gaints

యాష్లే గార్డ్నర్‌      

రూ.3.20 కోట్లు

బెత్మూనీ           

రూ.2 కోట్లు

జార్జియా వేర్హమ్‌              

రూ.75 లక్షలు

స్నేహ్రాణా

                రూ.75 లక్షలు

అనాబెల్సదర్లాండ్

                రూ.70 లక్షలు

డియాండ్ర డాటిన్

                రూ.60 లక్షలు

సోఫియా డన్క్లే

                రూ.60 లక్షలు

సుష్మా వర్మ

               రూ.60 లక్షలు

తనూజ కన్వర్

                రూ.50 లక్షలు

హర్లీన్డియోల్

                రూ.40 లక్షలు

అశ్వని కుమారి

                రూ.35 లక్షలు

హేమలత              

                రూ.30 లక్షలు

మాన్సి జోషి

                రూ.30 లక్షలు

మోనిక పటేల్

                రూ.30 లక్షలు

సబ్బినేని మేఘన

          రూ.30 లక్షలు

హర్లీ గాల

                రూ.10 లక్షలు

పరుణిక సిసోడియా

                రూ.10 లక్షలు

షబ్నమ్షకీల్

                రూ.10 లక్షలు

మొత్తం ప్లేయర్లు: 18

              విదేశీ ప్లేయర్లు: 6

ముంబై ఇండియన్స్

Mumbai Indians

నటాలీ సివర్‌          

రూ.3.20 కోట్లు

పూజ వస్త్రకర్‌        

రూ.1.90 కోట్లు

హర్మన్ప్రీత్కౌర్‌    

రూ.1.80 కోట్లు

యస్తిక భాటియా  

రూ.1.50 కోట్లు

అమేలియా కెర్‌     

రూ.1 కోటి

అమన్జోత్కౌర్‌   

రూ.50 లక్షలు

హేలీ మాథ్యూస్‌   

రూ.40 లక్షలు

క్లొయ్ట్రియాన్‌      

రూ.30 లక్షలు

హిదెర్గ్రాహమ్‌    

రూ.30 లక్షలు

ఇసాబెలె వోంగ్‌      

రూ.30 లక్షలు

ప్రియాంక బాల      

రూ.20 లక్షలు

ధార గుజ్జార్‌           

రూ.10 లక్షలు

హుమైరా కాజి     

రూ.10 లక్షలు

జింతిమని కలిత   

రూ.10 లక్షలు

నీలమ్బిష్త్‌           

రూ.10 లక్షలు

సయిక ఇషాక్‌       

రూ.10 లక్షలు

సోనమ్యాదవ్‌  

రూ.10 లక్షలు

మొత్తం ప్లేయర్లు: 17  

విదేశీ ప్లేయర్లు: 6

రాయల్చాలెంజర్స్బెంగళూరు

స్మృతి మంధాన    

రూ.3.40 కోట్లు

రిచా ఘోష్‌             

రూ.1.90 కోట్లు

ఎలీస్పెర్రీ               

రూ.1.70 కోట్లు

రేణుక సింగ్‌           

రూ.1.50 కోట్లు

సోఫీ డివైన్‌            

రూ.50 లక్షలు

హీతెర్నైట్‌            

రూ.40 లక్షలు

మేగన్షుట్‌          

రూ.40 లక్షలు

కనిక అహుజ       

రూ.35 లక్షలు

డేన్వాన్నికెర్క్‌    

రూ.30 లక్షలు

ఎరిన్బర్న్స్‌          

రూ.30 లక్షలు

ప్రీతి బోస్‌                               

రూ.30 లక్షలు

కోమల్జంజద్‌      

రూ.25 లక్షలు

ఆశ శోభన             

రూ.10 లక్షలు

దిశ కాసత్‌                             

రూ.10 లక్షలు

ఇంద్రాణి రాయ్‌      

రూ.10 లక్షలు

పూనమ్ఖేమ్నర్‌ 

రూ.10 లక్షలు

సహన పవార్‌       

రూ.10 లక్షలు

శ్రేయాంక పాటిల్‌   

రూ.10 లక్షలు

మొత్తం ప్లేయర్లు: 18  

విదేశీ ప్లేయర్లు: 6

 

Published date : 14 Feb 2023 04:10PM

Photo Stories