Skip to main content

U-19 Women’s T20 World Cup: తొలి అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌కప్‌ విజేత భారత్

తొలిసారి నిర్వహించిన అండర్‌–19 ప్రపంచకప్‌లో కొత్త చరిత్రను సృష్టిస్తూ టీమిండియా మహిళలు విశ్వవిజేతగా నిలిచారు.

మహిళల తొలి అండర్‌–19 ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ తమ పేరును ఘనంగా లిఖించుకుంది. 16 జట్లు పాల్గొన్న ఈ టి20 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. జ‌న‌వ‌రి 29వ తేదీ ద‌క్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ అండర్‌ –19పై నెగ్గింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్‌ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రస్తుతం పురుషుల అండర్‌–19 వరల్డ్‌కప్‌ విజేత భారత్‌ కాగా.. ఇప్పుడు మహిళల జట్టు కూడా జత చేరడం విశేషం.  ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులో తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్‌ అమ్మాయి షబ్నమ్‌ సభ్యులుగా ఉన్నారు. 

ICC T20 Team Of The Year 2022 : ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ఇదే..


ఆ్రస్టేలియాతో సెమీఫైనల్లో కూడా 99 పరుగులకే కుప్పకూలి అదృష్టవశాత్తూ విజయంతో బయటపడ్డ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ బలహీనత ఫైనల్లోనూ కనిపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి విఫలం కావడంతో జట్టు సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. టిటాస్‌ సాధు, అర్చన, పార్శవి ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ర్యానా మెక్‌డొనాల్డ్‌ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా.. ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లే నమోదయ్యాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ దూసుకుపోయింది. షఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్‌ (5) విఫలమైనా.. గొంగడి త్రిష (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), సౌమ్య (37 బంతు ల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన టిటాస్‌ సాధు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’గా నిలిచింది. 

బీసీసీఐ కానుక రూ.5 కోట్లు 
అండర్‌–19 టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది.  
ఎవరెవరిపై గెలిచామంటే.. 
లీగ్‌ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు 
యూఏఈపై 122 పరుగులతో విజయం 
స్కాట్లాండ్‌పై 83 పరుగులతో గెలుపు 
సూపర్‌ సిక్స్‌ దశలో: ఆ్రస్టేలియా చేతిలో 
7 వికెట్లతో ఓటమి. 
శ్రీలంకపై 7 వికెట్లతో విజయం 
సెమీస్‌లో: న్యూజిలాండ్‌పై 8 వికెట్లతో విజయం 

Jyothi Surekha: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు 

Published date : 30 Jan 2023 01:19PM

Photo Stories