Skip to main content

Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు

13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీలో జగజ్జేతగా నిలిచింది.

జ‌న‌వ‌రి 29వ తేదీ ఒడిసాలోని భువ‌నేశ్వ‌ర్‌లో జరిగిన ప్రపంచకప్‌ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్‌’లో 5–4తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ నిర్వహించారు. ‘షూటౌట్‌’లో నిర్ణీత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి.
‘సడెన్‌ డెత్‌’లో తొలి షాట్‌లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్‌లో జర్మనీ సఫలంకాగా..  బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్‌ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్‌ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006లో టైటిల్‌ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3–1తో ఆ్రస్టేలియాను ఓడించింది. 

ICC Mens T20 Cricketer of the Year 2022 : ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా.. 

 

Published date : 30 Jan 2023 03:06PM

Photo Stories