Virat Kohli: ఐపీఎల్‌లో కొహ్లి రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా..
Sakshi Education
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఏప్రిల్ 2వ తేదీ ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్‌గా దిగిన కింగ్ కోహ్లి 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీతో మెరిసిన కోహ్లికి 50 ప్లస్ స్కోరు చేయడం 50వ సారి. ఐపీఎల్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49, ఏబీ డివిలియర్స్ 43, రోహిత్ శర్మ 41 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌తో తరువాతి స్థానాల్లో ఉన్నారు.
అంతేకాదు ఆర్‌సీబీ ఓపెనర్‌గా కొహ్లి మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఇక కోహ్లి ఓవరాల్‌గా 224 మ్యాచ్‌ల్లో 6695 పరుగులు సాధించాడు.
IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!
Published date : 03 Apr 2023 05:50PM