Skip to main content

IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో అరుదైన ఘనత సాధించాడు.
MS Dhoni

ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్‌కే మ‌ద్య తొలి మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన ఫీట్‌ సాధించాడు. ధోని 41 సంవ‌త్స‌రాల‌ 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు. 
ఇప్పటి వరకు ఈ రికార్డు దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ పేరిట ఉండేది. ఐపీఎల్ 2011 సీజన్‌లో 41 సంవ‌త్స‌రాల‌ 249 వయస్సులో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా షేన్‌ వార్న్‌ వ్యవహరించారు. తాజా మ్యాచ్‌తో వార్న్ పేరిట ఉన్న 12 ఏళ్ల రికార్డును మిస్టర్‌ కూల్ బ్రేక్‌ చేశాడు. 

IPL 2023: ఐపీఎల్‌ 16వ సీజన్ ప్రారంభం.. మే 28న ఫైనల్‌ మ్యాచ్‌

ఇక తొలి మ్యాచ్‌ విషయానికి వస్తే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో పోటీప‌డిన‌ చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొద‌ట సీఎస్కే చేసిన 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.   

IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచ‌ల‌నం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..

Published date : 01 Apr 2023 03:22PM

Photo Stories