IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం.. మే 28న ఫైనల్ మ్యాచ్
ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. అన్నింటికి మించి 2019 తర్వాత అన్ని జట్లకూ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. కరోనా కారణంగా గత మూడు సీజన్ల పాటు వేదికల విషయంలో షరతుల కారణంగా అందరికీ తమ సొంత మైదానాల్లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు భారీ స్థాయిలో, స్థానిక అభిమానుల మద్దతుతో పది జట్లూ హంగామాకు సిద్ధమయ్యాయి. మారిన ఆటగాళ్లు, నిబంధనల్లో స్వల్ప మార్పులతో పదహారో సీజన్ లీగ్ కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతీయ జట్లకు ఆడుతున్న కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు చెందిన ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా తమ ఐపీఎల్ టీమ్‌లతో చేరతారు. మార్చి 30న అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్‌ల ఫొటో సెషన్ నిర్వహించారు. అస్వస్థత కారణంగా ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హాజరుకాలేదు.
IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచలనం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే..
కొన్ని మార్పులు..
‘ఇంపాక్ట్ ప్లేయర్’ పేరుతో కొత్త నిబంధనను లీగ్ కౌన్సిల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం తాము ముందుగా ప్రకటించిన నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లలో ఒకరిని మ్యాచ్ మధ్యలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగవచ్చు. అంటే బ్యాటింగ్ ఒకరు చేసిన తర్వాత అతని స్థానంలో తర్వాతి ఇన్నింగ్స్‌లో మరో బౌలర్‌ను తీసుకునే అవకాశం జట్టుకు ఉంది. అంటే పరిస్థితులను బట్టి ప్లేయర్‌ను మార్చుకునే ఈ సౌకర్యం జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. టాస్ తర్వాత తుది జట్టును ప్రకటించడం కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో దీనిని వాడారు. అంటే టాస్ గెలిస్తే ఒక రకమైన టీమ్, టాస్ ఓడితే మరో రకమైన టీమ్‌తో సిద్ధమై కెప్టెన్ టాస్‌కు వెళ్లవచ్చు. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్ తరహాలో వైడ్‌లు, నోబాల్స్ కోసం కూడా డీఆర్‌ఎస్‌ను వాడుకోవచ్చు.
Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్ పేరు
ఫార్మాట్ ఇలా...
లీగ్ దశలో ప్రతీ టీమ్ 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే పది జట్లు ఉండటంతో గత ఏడాదిలాగే కాస్త భిన్నమైన ఫార్మాట్‌ను అమలు చేస్తున్నారు. 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్‌లో తమ గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున.. మరో గ్రూప్‌లోనే ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’ లో ముంబై, కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ఉదాహరణకు ముంబై తమ గ్రూప్‌లోనే కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నోలతో ఒకేసారి తలపడుతుంది. గ్రూప్ ‘బి’లో ఉన్న చెన్నై, బెంగళూరు, గుజరాత్, పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లను రెండేసి సార్లు ఎదుర్కొంటుంది. అయితే ఎలా ఆడినా ప్రతీ టీమ్‌కు సొంతగడ్డపై 7 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది.
డిజిటల్ మీడియా మారింది..
గత సీజన్ వరకు మొబైల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు స్టార్ స్పోర్ట్స్‌కే చెందిన ‘హాట్ స్టార్’లో అవకాశం ఉండేది. అయితే ఈసారి మీడియా హక్కులు మారాయి. టీవీ ప్రసారాలు స్టార్ స్పోర్ట్స్‌లోనే వస్తాయి. డిజిటల్ హక్కులు మాత్రం అంబానీకి చెందిన వయాకామ్ 18 గ్రూప్ కొనుక్కుంది. దాంతో ఈసారి మొబైల్‌లో ‘జియో సినిమా’లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడవచ్చు.
South Africa: టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
ప్రారంభోత్సవ వేడుకలు..
ఐపీఎల్‌లో 2018లో తర్వాత మళ్లీ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. నేడు ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ పాటతో పాటు కత్రినా కైఫ్, టైగర్ ష్రాఫ్, రష్మిక మంధాన, తమన్నా డ్యాన్స్‌లతో అలరిస్తారు.
బుమ్రా మినహా..
ఈసారి లీగ్‌లో భారత రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ స్టార్లు బరిలోకి దిగుతున్నారు. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, కాన్వే, రూట్, హ్యారీ బ్రూక్ తదితరులు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే గాయంతో అనూహ్యంగా దూరమైన వారిలో బుమ్రా అందరికంటే కీలక ఆటగాడు. అతను లేకుండా ముంబై బరిలోకి దిగుతుండగా, గాయంతో శ్రేయస్ అయ్యర్ కూడా తప్పుకున్నాడు.