Skip to main content

NCERT: ఇక‌పై గాంధీ, గాడ్సే పాఠాలుండ‌వు... పాఠ్య‌పుస్త‌కాల నుంచి తొల‌గించిన ఎన్‌సీఈఆర్‌టీ.. ఎందుకంటే!

ప‌న్నెండో త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కాల నుంచి కొన్ని చాప్ట‌ర్ల‌ను ఎన్‌సీఈఆర్‌టీ తొల‌గించింది. దేశానికి స్వాతంత్య్రం అనంత‌రం సంభ‌వించిన హిందు, ముస్లిం అల్ల‌ర్ల‌కు సంబంధించిన అంశాల‌ను పూర్తిగా తొల‌గించింది. హిందు, ముస్లింల మ‌ధ్య స‌యోధ్య కోసం మ‌హాత్మ గాంధీ చేసిన ప్ర‌య‌త్నాలు... గాంధీ హ‌త్య‌, ఆ త‌ర్వాత ఆర్ఎస్ఎస్‌పై నిషేధం, ఇటీవ‌ల జ‌రిగిన గోద్రా అల్ల‌ర్లు.. అల్ల‌ర్ల త‌ర్వాత చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లను 11, 12 తరగతుల రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి తొల‌గించింది.
NCERT
NCERT

ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) సిలబస్‌ హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా అతివ్యాప్తి, అసంబద్ధం కారణాలుగా చూపుతూ ఇలా కొన్ని పాఠ్యభాగాలను తొలగించారు. తొలగింపునకు గురైన వాటిలో గుజరాత్‌ అల్లర్లు - వాటి పరిణామాలు, మొగల్‌ దర్బార్లు, ఎమర్జెన్సీ వంటి అంశాలు సైతం ఉన్నాయి. అయితే, అది ఈ విద్యాసంవత్సరం జరిగిన సిలబస్‌ మార్పు కాదని.. గతేడాది జూన్‌లోనే సిలబస్‌ హేతుబద్ధీకరణ జరిగినట్లు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీ చెబుతున్నారు.

చ‌ద‌వండి: ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ల‌క్ష్య‌మిదే..​​​​​​​
ఒక్కొక్క‌టిగా మార్చుకుంటూ....

6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేసింది. వీటిలో 12వ తరగతిలో 'స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాలుస అలాగే 'ప్రజా ఉద్యమాల రైజ్', 'ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినేషన్' అనే చాప్ట‌ర్స్‌ను తొలగించారు. దీంతో పాటు పదో తరగతి నుంచి 'ప్రజాస్వామ్య రాజకీయాలు-2,'ప్రజాస్వామ్యం-భిన్నత్వం', 'ప్రజా పోరాటాలు-ఉద్యమాలు', ''ప్రజాస్వామ్యానికి సవాళ్లు'' అనే పాఠ్యాంశాల‌ను  తొలగించారు.

చ‌ద‌వండి:​​​​​​​ అమెజాన్‌లో మ‌ళ్లీ కోత‌లు... ఈ ద‌ఫాలో గేమింగ్ ఉద్యోగులు బ‌లి
కుల ప్ర‌స్తావ‌న‌తోనే...!
అయితే ఇప్ప‌టివ‌ర‌కు 12వ త‌ర‌గ‌తి చరిత్ర పాఠ్య పుస్త‌కాల్లో నాథూరామ్ గాడ్సేను గాంధీని హత్య చేసిన 'పుణెకు చెందిన బ్రాహ్మణుడుస‌గా ఉంది. ఒక కులాన్ని ప్ర‌స్తావించ‌డంపై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెళ్లువెత్తినా ఎన్‌సీఈఆర్‌టీ స్పందించ‌లేదు. తాజాగా ఇలాంటి వాటిని తొల‌గిస్తూ వ‌స్తోంది. మ‌రోవైపు ఎన్‌సీఈఆర్‌టీ చ‌ర్య‌ల‌పై విప‌క్ష కాంగ్రెస్ పార్టీ మండిప‌డిపోతోంది. పాఠ్యాంశాల‌ను తొల‌గించినంత మాత్రాన చ‌రిత్ర‌ను ఎవ‌రూ మార్చ‌లేర‌ని పేర్కొంటోంది.

Published date : 06 Apr 2023 04:06PM

Photo Stories