Lay Offs: అమెజాన్‌లో మళ్లీ కోతలు... ఈ దఫాలో గేమింగ్ ఉద్యోగులు బలి
అన్నింట్లోనూ అమెజాల్ వేలు పెట్టింది. ప్రతీ విభాగంలో ఎదగాలని ఆశించింది. ఇందులో భాగంగానే ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ గేమ్స్ వంటి గేమింగ్ విభాగాలలో భారీగా ఉద్యోగులను నియమించుకుంది. కానీ, అనుకున్న మేరకు లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవడంతో వీరిని తప్పిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే గేమింగ్ విభాగాల్లో పనిచేసే 100 మందికి పైగా ఉద్యోగులను అమెజాన్ తాజాగా తొలగించింది.
చదవండి: హాఫ్ జీతానికే పనిచేయండి... లేదంటే.. ప్రెషర్స్‌కు ఐటీ కంపెనీ భారీ షాక్
తొలగింపులు ఇలా...
ఏడబ్ల్యూఎస్, అమెజాన్ అడ్వటైజింగ్, ట్విచ్, హెచ్ఆర్ విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగించే పనిలో అమెజాన్ ఉంది. లేఆఫ్స్‌పై అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపారు. ఆ మెయిల్స్‌లో తొలగింపుల నిర్ణయం కష్టంతో కూడుకున్నది. కానీ సంస్థ దీర్ఘకాలిక విజయాలు సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని చావుకబురు చల్లగా చెప్పేశాడు.
చదవండి: సాఫ్ట్‌వేర్ జాబ్ దొరకడం ఇంత కష్టమా... 150 కంపెనీలకు అప్లై చేస్తే...!
18వేల మంది ఉద్యోగుల తొలగింపు
గతేడాది నవంబర్‌లో అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తొలిసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక ప్రకటన చేశారు. అమెజాన్ People eXperience and Technology (PXT)కి చెందిన ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఏడాది జనవరిలో 18వేల మందిని అమెజాన్ ఫైర్ చేసింది. తాజాగా మరో 9 వేల మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.