International Day of Non-Violence: అక్టోబర్ 2వ తేదీ అంతర్జాతీయ అహింసా దినోత్సవం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా.. 2007, జూన్ 15వ తేదీ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఈ రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలు దీనికి మద్దతు ఇచ్చాయి.
ఈ దినోత్సవం విద్య, ప్రజా అవగాహన ద్వారా అహింసకు సంబంధించిన సమగ్ర అవగాహనను పెంపొందిస్తుంది. అహింసా తత్వం ప్రపంచంలో శాంతి, సహనం, సమర్థతకు ప్రేరణ కలిగించడంలో ఎంత కీలకమో పునరుద్ఘాటిస్తుంది.
ఈ దినోత్సవం ఎందుకు ముఖ్యం?
➣ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా హింసను నిరసిస్తూ, శాంతిని ప్రోత్సహిస్తూ, అహింసా మార్గం గొప్పదని ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.
➣ గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహం, అహింస వంటి విలువలను ఈ రోజు గుర్తు చేసుకుని, వాటిని మన జీవితంలో అనుసరించడానికి ప్రేరణ పొందుతాము.
➣ ఈ దినోత్సవం.. ప్రపంచంలోని అన్ని దేశాలు, ప్రజలు కలిసి శాంతియుతంగా జీవించాలనే ఆశయానికి ప్రతీక.
Mahatma Gandhi Books: నేడు మహాత్మా గాంధీ జయంతి.. ఆయన రాసిన పుస్తకాలు ఇవే..