Skip to main content

Padma Awards 2023 : ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈ సారి తెలుగు తేజాలకు..

74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జ‌న‌వ‌రి 25వ తేదీన (బుధవారం) ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి ఆరుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ దక్కింది.
padma awards 2023 news
Padma awards 2023 list

9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత ములాయంసింగ్‌ యాదవ్‌తో పాటు ప్రముఖ తబల వాయిద్య కళాకారుడు జాకీర్‌ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ పద్మ విభూషణ్‌ గ్రహీతల్లో ఉన్నారు.

☛ Padma Awards 2022: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామితో పాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, సుధామూర్తి, గాయకురాలు వాణీ జయరాం తదితరులు పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే..
తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ సహా ఏడుగురు, తెలంగాణ నుంచి సాహితీవేత్త బి.రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం ముగ్గురున్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేశ్‌ డి.పటేల్‌కు కూడా తెలంగాణ కోటాలో పద్మభూషణ్‌ దక్కడం విశేషం. మిల్లెట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా దూదేకుల ఖాదర్‌ వలీకి కర్నాటక కోటాలో పద్మశ్రీ లభించింది.

పద్మ అవార్డుల విజేతల్లో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీ/ఎన్‌ఆర్‌ఐ కేటగిరీకి చెందినవారున్నారు. పద్మ పురస్కారాల విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి సాటిలేనిదంటూ ప్రశంసించారు. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు.

☛ Padma Awards 2021: పద్మ పురస్కారాల పూర్తి జాబితా

పద్మ విభూషణ్ వరించింది వీళ్లనే..
ములాయంసింగ్‌ యాదవ్‌ (మరణానంతరం), జాకీర్‌ హుస్సేన్, ఎస్‌ఎం కృష్ణ, ఆర్కిటెక్ట్‌ బాలకృష్ణ దోషీ (మరణానంతరం), ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహాలనబిస్‌ (మరణానంతరం), ఇండో–అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ వర్ధన్‌

ఏపీ నుంచి.. పద్మశ్రీ  
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళ), సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ), గణేశ్‌ నాగప్పకృష్ణరాజనగర (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), సీవీ రాజు (కళ), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ), ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం–విద్య).

☛ పద్మ పురస్కారాలు-2020

తెలంగాణ నుంచి.. పద్మశ్రీ : 
మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం–విద్య).

పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఖాదర్‌ వలీతో పాటు స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం), సినీ నటి రవీనా టాండన్‌ తదితరులున్నారు.


2023 పద్మ విభూషణ్‌ (6) గ్రహీతలు వీరే..
➤ బాలకృష్ణ దోషి (గుజరాత్‌) – ఆర్కిటెక్చర్‌ (మరణానంతరం )

➤ జాకీర్‌ హుస్సేన్‌ (మహారాష్ట్ర ) – ఆర్ట్

➤ ఎస్‌ఎం కృష్ణ (కర్ణాటక ) – పబ్లిక్‌ అఫైర్స్‌

➤ దిలీప్‌కుమార్‌ ( మెడిసిన్‌ ) – పశ్చిమ బెంగాల్‌

➤ శ్రీనివాస్‌ వరదాన్‌ ( అమెరికా ) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

➤ ములాయం సింగ్‌ యాదవ్‌ ( ఉత్తర ప్రదేశ్‌) – పబ్లిక్‌ అపైర్స్‌ (మరణానంతరం )


2023 పద్మ భూషణ్‌ (9) గ్రహీతలు వీరే.
➤ ఎస్‌ఎల్‌ భైరప్ప ( కర్ణాటక ) – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

➤ కుమార మంగళం బిర్లా ( మహారాష్ట్ర ) ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ

➤ దీపక్ ధార్‌ ( మహారాష్ట్ర ) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్

➤ వాణి జయరాం ( తమిళనాడు ) ఆర్ట్‌

➤ చినజీయర్‌ స్వామి ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం

➤ సుమన్‌ కల్యాణ్‌పూర్ ( మహారాష్ట్ర ) – ఆర్ట్‌

➤ కపిల్‌ కపూర్‌ (ఢిల్లీ ) – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

➤ సుధామూర్తి (కర్ణాటక ) – సామాజిక సేవ

➤ కమలేశ్‌ డి. పటేల్‌ ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం

2023 పద్మశ్రీ ( 91 ) గ్రహీతలు వీరే..
➤ సుకమ ఆచార్య ( హర్యానా ) – ఆధ్యాత్మికం

➤ జోధియాబాయ్‌ బైగా ( మధ్యప్రదేశ్‌) – ఆర్ట్‌

➤ ప్రేమ్‌జీత్‌ బారియా ( దాద్రా నగర్‌ )- ఆర్ట్‌

➤ ఉషా బార్లే ( ఛత్తీస్‌గఢ్‌) -ఆర్ట్‌

➤ మునీశ్వర్ చందర్ దావర్ (మధ్యప్రదేశ్) – మెడిసిన్

➤ హేమంత్‌ చౌహాన్‌ ( గుజరాత్‌ ) – ఆర్ట్‌

➤ భానుబాయ్ చైతరా (గుజరాత్) – ఆర్ట్ ( పెయింటింగ్)

➤ హేమోప్రోవ ఛటియా ( ఆస్సాం) – ఆర్ట్‌

➤ నరేంద్ర చంద్ర దెబ్బర్మ ( త్రిపుర )

➤ పబ్లిక్‌ ఎఫైర్స్‌ సుభద్రా దేవి ( బిహార్‌) – ఆర్ట్‌

➤ ఖాదర్‌వళి దుదేకుల ( కర్ణాటక ) సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

➤ హేమచంద్ర గోస్వామి ( పశ్చిమ బెంగాల్‌) – ఆర్ట్‌

➤ రాధా చరణ్‌ గుప్తా ( ఉత్తరప్రదేశ్) లిటరేచర్‌ అండ్ ఎడ్యుకేషన్‌

➤ మోదాడుగు విజయ్‌ గుప్తా ( తెలంగాణ ) – సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

➤ అహ్మద్‌ హుస్సేస్‌& మహ్మద్‌ హుస్సేన్‌ ( రాజస్థాన్‌ ) – ఆర్ట్‌

➤ దిల్షాద్‌ హుస్సేన్‌ (ఉత్తరప్రదేశ్‌) – ఆర్ట్‌ రతన్

➤ చంద్రాకర్ (అండమాన్ నికోబర్ ) -మెడిసిన్

➤ హీరాబాయి లోబి ( గుజరాత్ ) – సంఘసేవకురాలు ( ట్రైబల్)

➤ రామ్కుయివాంఘ్బే న్యుమె (అస్సాం) – సామాజిక సేవ ( కల్చర్ )

➤ వీపీ అప్పకుట్టన్ పొడువాల్ (కేరళ) – సామాజిక సేవ

➤ సంకురాత్రి చంద్రశేఖర్ ( ఏపీ )

➤ సామాజిక సేవ ( అఫ్రడబుల్ హెల్త్ కేర్ )

➤ వడివేల్ గోపాల్ & మసి సదాయ్యన్ ( తమిళనాడు ) – సామాజిక సేవ ( ఎనిమల్ వెల్ఫేర్ )

➤ తుల రామ్ ఉప్రెటి (సిక్కిం) – వ్యవసాయం

➤ నెక్రమ్ శర్మ ( హిమాచల్ ప్రదేశ్ ) – వ్యవసాయం

➤ జనుమ్ సింగరాయ్ (జార్ఖండ్ ) – లిటరేచర్ &ఎడ్యుకేషన్

➤ ధనీరామ్ టోటో (పశ్చిమ బెంగాల్ ) – లిటరేచర్ &ఎడ్యుకేషన్

➤ బి.రామకృష్ణా రెడ్డి ( తెలంగాణ )- లిటరేచర్ &ఎడ్యుకేషన్

➤ అజయ్ కుమార్ మాండవి ( ఛత్తీస్గఢ్ ) – ఆర్ట్ (వుడ్ కార్వింగ్)

➤ రాణి మచ్చయ్య (కర్ణాటక ) – ఆర్ట్ ( ఫోక్ డ్యాన్స్)

➤ కేసీ రున్రెంసంగి ( మిజోరం ) – ఆర్ట్ ( వోకల్ – మిజో )

➤ రిసింగబోర్ కుర్కలాంగ్ ( మేఘాలయ ) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్ )

➤ మంగళ కాంతి రాయ్ ( పశ్చిమ బెంగాల్) – ఆర్ట్ (ఫోక్ మ్యూజిక్)

➤ మోవా సుబంగ్ ( నాగాలాండ్) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్ )

➤ మునివెంకటప్ప (కర్ణాటక) – ఆర్ట్ ( ఫోక్ మ్యూజిక్)

➤ దోమర్ సింగ్ కున్వార్ (ఛత్తీస్గఢ్ ) – ఆర్ట్ (డ్యాన్స్)

➤ పరశురాం కొమాజి ఖునె ( మహారాష్ట్ర ) – ఆర్ట్ (థియేటర్ )

➤ గులాం మహమ్మద్ జాజ్ (జమ్మూకశ్మీర్) – ఆర్ట్(క్రాప్ట్స్)

➤ పరేశ్ రాథ్వా (గుజరాత్) – ఆర్ట్ (పెయింటింగ్) కపిల్ దేవ్ ప్రసాద్ (బిహార్) – ఆర్ట్ (టెక్స్టైల్)

Padma Awards 2023 List PDF :

Published date : 26 Jan 2023 12:34PM
PDF

Photo Stories