Jagananna Gorumudda: జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం
పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో 15 రకాల ఆహార పదార్థాలను గోరుముద్ద ద్వారా అందిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి గతంలో ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయని దుస్థితి. ఇప్పుడు గోరుముద్ద కోసం ఏడాదికి రూ.1,824 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు దీనికి అదనంగా రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో ఉదయం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని మార్చి 21న తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
మొదటి రోజు నుంచే..
అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి చదువులను సంస్కరించడంపై దృష్టి పెట్టాం. అందులో భాగంగానే గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, విద్యాకానుక, నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. 8వ తరగతిలోకి వచ్చిన వెంటనే పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇక 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ ప్యానెల్స్) ద్వారా డిజిటల్ బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాడు – నేడు పూర్తైన స్కూళ్లలో జూన్ నుంచి అమలులోకి తీసుకొస్తాం. ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం.
Mega Textiles Park: తెలంగాణలో టెక్స్‌టైల్ పార్కు.. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఏర్పాటు
మరింత బలవర్ధకంగా గోరుముద్ద
గోరుముద్దను ఇప్పటికే రోజుకొక మెనూతో రుచికరంగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత బలవర్ధకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇవాళ్టి నుంచి పిల్లలకు రాగిజావ కూడా అందిస్తూ గోరుముద్దను మరింత పుష్టికరంగా తీర్చిదిద్దుతున్నాం. రాగి జావ పిల్లల్లో సమృద్ధిగా ఐరన్, కాల్షియం కంటెంట్ పెరిగేలా దోహదపడుతుంది. మిడ్ డే మీల్స్ అంటూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా ఏడాదికి రూ.450 కోట్లు కూడా మధ్యాహ్న భోజనానికి ఖర్చు చేయని దుస్థితి.
అలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా రోజుకొక మెనూతో పూర్తిగా మార్చి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో రూ.450 కోట్లు మాత్రమే ఉన్న బడ్జెట్‌ను ఇప్పుడు ఏడాదికి రూ.1,824 కోట్లకు పెంచి గోరుముద్ద కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు రాగి జావ కోసం అదనంగా మరో రూ.86 కోట్లు ఇస్తున్నాం. రోజుకో మెనూతో పిల్లలకు రుచికరమైన భోజనం అందిస్తున్నాం.
సత్యసాయి ట్రస్టు సహకారంతో..
పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామి కావడం నిజంగా మంచి పరిణామం. ఏటా దాదాపు రూ.86 కోట్లు ఖర్చయ్యే రాగి జావ కోసం సత్యసాయి ట్రస్టు రూ.42 కోట్లు అందిస్తుండగా మిగిలిన రూ.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరుస్తూ మంచి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నాం.