Skip to main content

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం

విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధాని కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. త్వరలోనే ఇక్కడి నుంచే పరిపాలన సాగించబోతున్నాన‌ని, త్వరలోనే అది సాకారం అవుతుందన్నారు.
Visakhapatnam

నీరు, సముద్రతీరం, విస్తారమైన ఖనిజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతరత్రా ప్రకృతి వనరులు.. వీటన్నింటికీ తోడు పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, పెట్టుబడులకు స్వర్గధామమని వైఎస్‌ జగన్ అన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 మార్చి 3వ తేదీ ఆయన ప్రారంభించారు.

Female Population: ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య.. ప్ర‌తి వెయ్యి మంది అబ్బాయిలకు ఎంత మంది అమ్మాయిలున్నారంటే..?

అనంతరం దేశ, విదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలు హాజరైన ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నామని, వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కాగా 248 ఎంవోయూలను మార్చి 4వ తేదీ కుదుర్చుకుంటామని, వాటి విలువ రూ.1.15 లక్షల కోట్లు అని తెలిపారు. వాటితో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రిలయెన్స్‌ గ్రూప్, అదాని గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలెజ్, పార్లే, శ్రీ సిమెంట్స్‌ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించి వ్యాపారాన్ని విస్తరించనున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎలాంటి సహకారం అందించేందుకునైనా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉంటుందని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం ఏ విధంగా అనుకూలమో ఆయన వారికి స్పష్టంగా వివరించారు.‘‘2021–22లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు సాధించింది. గత మూడేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు కూడా వృద్ధి చెందాయి. సీఏజీఆర్‌ (సగటు వార్షిక వృద్ధి రేటు) 9.3 శాతంగా నమోదైంది. సుస్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్‌ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో 2020–21కి ఇచ్చిన ఎస్‌జీడీ ఇండియా ఇండెక్స్‌ ర్యాంకుల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది’’ అని చెప్పారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 04 Mar 2023 12:06PM

Photo Stories