Welfare Schemes: తెలంగాణలో నాలుగు కొత్త సంక్షేమ పథకాలు అమలు

రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ మార్చి 31లోగా ఈ నాలుగు పథకాలను అందజేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున జనవరి 26 అర్ధరాత్రి నుంచే టకీటకీమని రైతుల ఖాతాల్లో పడతాయని ప్రకటించారు.
2004-2014 మధ్య రైతులకు, పేదలకు ఇచ్చిన ఉచిత ఇళ్లు గురించి ఆయన మాట్లాడుతూ.. "ఇందిరమ్మ ఇళ్లు అంటే వైఎస్సార్ గుర్తొస్తాయి" అని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో 36,000 మందికి ఇళ్లు ఇవ్వాలని, అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా కూడా త్వరలోనే పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి ప్రజాపాలనను తన ప్రభుత్వ విధానంగా ప్రస్తావించారు. "ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామాలకు అధికారులు రావడం సాధారణం కాదు, కానీ మా హయాంలో మూడుసార్లు ప్రజల దగ్గరికి వచ్చాం" అని ఆయన అన్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వంతో.. మేఘా ఇంజనీరింగ్ మూడు కీలక ఒప్పందాలు.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలు
బడుగు, బలహీన వర్గాల కోసం ఒకే రోజున నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషకరమని సీఎస్ శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో 12,861 గ్రామసభలు, 3,487 వార్డు సభలను నిర్వహించామని తెలిపారు.