Skip to main content

IT Jobs: ఫ్రెషర్లకు ఇక పండ‌గే.. లక్ష జాబ్స్‌.. ప్రారంభంలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు సై అంటున్నాయి. టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ కెరీర్‌ ఔట్‌లుక్‌ నివేదిక ప్రకారం.. 2022 జూలై–డిసెంబర్‌లో ఫ్రెషర్లను చేర్చుకునేందుకు 59 శాతం కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
software jobs for freshers

ఈ ఏడాది జనవరి–జూన్‌తో పోలిస్తే ఇది 12 శాతం అధికం కావడం విశేషం. ఐటీలో 65 శాతం, ఈ-కామర్స్‌ 48, టెలికమ్యూనికేషన్స్‌లో 47 శాతం సంస్థలు ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

IT Jobs: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న టాప్ ఐటీ కంపెనీలు ఇవే..!

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

ప్రారంభంలోనే..
ఐటీలో లక్ష మంది ఫ్రెషర్ల నియామకాలు ఉండే అవకాశం ఉంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్స్‌ నియామకాల చుట్టూ ఉన్న సెంటిమెంట్‌ భారతదేశంలో గణనీయంగా మెరుగుపడుతోంది. ఎక్కువ కంపెనీలు ఫ్రెషర్స్‌ను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేశంలోని యువత ఉపాధి సామర్థ్యం విలువతో కూడిన మార్పుకు గురైందనడానికి ఈ ధోరణి నిదర్శనం. ఒక ఏడాదిలోనే ఫ్రెషర్స్‌ హైరింగ్‌ సెంటిమెంట్‌ 42 శాతం పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇది వేగంగా అధికం అవుతుంది. 14 ప్రాంతాల్లోని 18 రంగాలకు చెందిన 865 కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికవెల్లడైంది.

Software Jobs: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా.. ! అయితే మీకోస‌మే ఈ అవ‌కాశం

IT Jobs: జోరుగా.. హుషారుగా.. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు..!

Inspiring Story: రైతు బిడ్డ‌కు జాక్‌పాట్‌.. రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎక్క‌డంటే..?

Inspiring Story: ఫంక్షన్స్‌లో మాపై ‘చిన్న చూపు’.. ఈ క‌సితోనే రూ.40 లక్షల ప్యాకేజీతో..

గుమాస్తా.. కుతురికి జాక్‌పాట్ .. రూ.44 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం

 

Published date : 22 Aug 2022 07:06PM

Photo Stories