Skip to main content

IT Jobs: జోరుగా.. హుషారుగా.. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు..!

కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిపోవడం.. సానుకూల ఆర్థిక కార్యకలాపాలు, ఎగుమతులకు డిమాండ్‌ వెరసి వ్యాపార వృద్ధి అవకాశాల నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయి.
it jobs recruitment 2022
IT Jobs recruitment

ఐటీ తో పాటు ఇతర రంగాల్లో కంపెనీలు నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

IT Jobs: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న టాప్ ఐటీ కంపెనీలు ఇవే..!

రానున్న రోజుల్లో ఉద్యోగులను భారీగా నియమించుకునేందుకు.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) తాము ఉద్యోగులను నియమించుకోనున్నట్టు 54% కంపెనీలు తెలిపాయి. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలి స్తే 4% అధికమని టీమ్‌లీజ్‌ సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఏప్రిల్‌–జూన్‌ కాలానికి ‘టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ను విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీలు రెండంకెల వృద్ధి ని అంచనా వేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకునే ధోరణిలో ఉన్నాయి. 

Job: శ్రీకాళహస్తి అమ్మాయికి రూ.40 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఎలా వ‌చ్చిందంటే..?

అత్యధికంగా ఈ రంగంలోనే..
21 రంగాలకు చెందిన 796 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఇందు లో 16 రంగాల్లోని కంపెనీలు నియామకాలకు అను కూలంగా ఉన్నాయి. ఐటీలో 95%, విద్యా సేవల్లో 86%, ఈకామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 81%, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో 78% కంపెనీలు ఉద్యోగ నియామక ప్రణాళికలతో ఉన్నాయి. అగ్రికల్చరల్, ఆగ్రోకెమికల్స్, బీపీవో/ఐటీఈఎస్, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాల్లో నియామకాల ధోరణి బలహీనంగా ఉందని నివేదిక వెల్లడించింది.

Software Jobs: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయడమే మీ లక్ష్యమా.. ! అయితే మీకోస‌మే ఈ అవ‌కాశం​​​​​​​

Job Opportunity: ప్ర‌ముఖ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం..శాల‌రీ ఎంతంటే..?

Published date : 29 Apr 2022 02:44PM

Photo Stories