AP Contract Employees Regularization 2023 : ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు.. రెగ్యులర్.. పూర్తి వివరాలు ఇవే..!
దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయనుంది. కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన.. సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు.
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధించిన దస్త్రం పై సంతకం చేశారని సమాచారం. 2014 జూన్ 2 కంటే ముందు నియమింపబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి తుది ఉత్తర్వులు ఈవారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
భారీగా జీతం పెంపు.. అలాగే ఇన్యూరెన్స్ కూడా..
విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ ఆగస్టు 16వ తేదీన (బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది.
☛ APPSC Group 2 Success Plan : ఇలా చదివితే గ్రూప్-2 కొట్టడం ఈజీనే.. | DR. ABDUL KAREEM SIR