Skip to main content

AP Government Jobs 2023 : ఆగస్టు 23వ తేదీన 3,295 అధ్యాపక పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. వీరికి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశ్వవిద్యాల­యాలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోద ముద్ర వేసిన విష‌యం తెల్సిందే. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు అధ్యాపక సిబ్బంది నియామకాల్లో అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ap cm ys jagan mohan reddy latest news telugu
AP CM YS Jagan Mohan Reddy

వర్సిటీల్లో 2,635 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసి­యేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్‌ పోస్టులతో పాటు ట్రిపుల్‌ ఐటీల్లో 660 లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫె­సర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదించగా ఒకే రిక్రూట్‌మెంట్‌లో చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ కానుండగా నవంబర్‌ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది.

☛ APPSC Group 2 Success Plan : ఇలా చ‌దివితే గ్రూప్‌-2 కొట్ట‌డం ఈజీనే.. | DR. ABDUL KAREEM SIR

ఏపీపీఎస్సీ ద్వారా..

appsc jobs news telugu 2023

విశ్వవిద్యాల­యాల్లోని అధ్యాపక పోస్టుల భర్తీకి షెడ్యూల్, పరీక్షా విధానంపై అధికారులతో సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆగస్టు 23వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. సెప్టెంబరు 3, 4వ వారాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 10వతేదీ నాటికి ఫలితాలను ప్రకటించి ఆ తర్వాత నెల రోజుల్లోగా ఇంటర్వ్యూలు చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్‌ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

☛ APPSC Group 2 New Syllabus : గ్రూప్‌ 2 ఎన్ని పోస్టులకు నోటిఫికేష‌న్ అంటే..? గ్రూప్‌-2కి బెస్ట్ బుక్స్ ఇవే..

వీరికి వెయిటేజీ..

ap cm ys jagan jobs news telugu

ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో 51 వేల పోస్టుల భర్తీతోపాటు అంతకు ముందు 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామ­కాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తి చేసిన విషయాన్ని సమావేశంలో సీఎం జగన్‌ ప్రస్తావించారు. ఇదే తరహాలో వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలను కూడా వేగంగా, సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూటికి నూరుశాతం మెరిట్‌ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్‌ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా ఇంటర్వ్యూ సమయంలో కేటాయించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.

చదవండి: ఏపీపీఎస్సీ ☛ స్టడీ మెటీరియల్ ☛ బిట్ బ్యాంక్ ☛ గైడెన్స్ ☛ ప్రీవియస్ పేపర్స్ ☛ సక్సెస్ స్టోరీస్ ☛ సిలబస్ ☛ ఆన్‌లైన్ టెస్ట్స్ ☛ ఆన్‌లైన్ క్లాస్ ☛ ఎఫ్‌ఏక్యూస్‌

Also read: APPSC Group 2 Notification 2022 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

APPSC Group 2 New Syllabus 2023 Details : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త‌ సిల‌బ‌స్ ఇదే.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్ అంటే..?

Published date : 11 Aug 2023 11:52AM

Photo Stories