Skip to main content

District wide ఫార్మెటివ్‌, సీబీఏ– 1 పరీక్షలు ప్రారంభం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు ఫార్మేటివ్‌, సీబీఏ–1 పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ(డీసీఈబీ) హేమారెడ్డి తెలిపారు.
Examinations
Examinations

సోమవారం ఆయన మాట్లాడుతూ 1 నుంచి 8వ తరగతులకు ఓఎంఆర్‌ బేస్డ్‌లో, 9, 10 తరగతులకు పాత విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. కొత్తగా అమలు చేస్తున్న టొఫెల్‌ పరీక్ష నిర్వహణపై టీచర్లకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. సీబీఏ విధానాన్ని విద్యార్థులు అర్థం చేసుకునేలా బైలింగ్విల్‌ (తెలుగు, ఇంగ్లీష్‌) లో ప్రశ్నపత్రం రూపొందించారన్నారు. ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోని నిర్వాహకులు ప్రశ్నపత్రాల కోసం 1 నుంచి 5 వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రూ.150, 6 నుంచి 10 వ తరగతి వరకు రూ.200 చెల్లించాలని సూచించారు. సెక్రటరీ, డీసీఈబీ, చిత్తూరు (ఐఎఫ్‌ఎస్‌సీ:ఎస్‌బీఐ000085) పేరుతో డీడీ రూపంలో చెల్లించాలని తెలిపారు.

Also read: Open Tenth అభ్యర్థులు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు

Published date : 01 Aug 2023 03:27PM

Photo Stories