Skip to main content

Medical Colleges : వైద్య క‌ళాశాల‌లు ప్ర‌వేటుకు.. విద్యార్థుల భ‌విష్య‌త్తు..!

వైద్య విద్యకు ‘చంద్ర’ గ్రహణం పడుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.
Government medical colleges moves to private in AP

రాజమహేంద్రవరం: వైద్య విద్యకు ‘చంద్ర’ గ్రహణం పడుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. తద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్యులు కావాలన్న కలను దూరం చేస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు నీట్‌ రాసి ప్రభుత్వ వైద్యశాలల్లో మెడికల్‌ సీటు కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

వైద్య విద్య ఖరీదైన విషయం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంత ఖరీదైన వైద్య విద్యను పేదలకు చేరువ చేయాలన్న తలంపుతో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో రాజమహేంద్రవరానికి ఒకటి రావాల్సి ఉంది. అనుకున్నదే తడువుగా రూ.475 కోట్లతో కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేశారు. బోధన వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నగరంలోని సెంటర్‌ జైలు ప్రాంగణంలో కళాశాల ఏర్పాటైంది. గత జగన్‌ ప్రభుత్వంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం, అనుమతులు రావడంతో తరగతులు సైతం గతేడాది ప్రారంభమయ్యాయి.

AP Schools : తాజాగా ఈ పరీక్షలు రద్దు చేస్తూ కీల‌క‌ నిర్ణయం..

తొలి ఏడాది 150 సీట్లు

రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో అకడమిక్‌ కార్యకలా పాల నిర్వహణకు అనుమతులు లభించడంతో 150 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అవసరమైన వసతులు, ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజమండ్రి జీజీహెచ్‌ను బోధనాస్పత్రిగా తీర్చిదిద్దారు. గతేడాది కళాశాల ప్రారంభమైంది. మొదటి సంవత్సరం విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. తిరిగి మొద టి సంవత్సరానికి సంబంధించి 150 ప్రవేశాలు నీట్‌ ద్వారా భర్తీ ప్రస్తుతం భర్తీ కావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఫీజుల్లో భారీ వ్యత్యాసం

ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు ఏడాదికి రూ.12 వేలు మాత్రమే ఉంటాయి. అదీ కేవలం కన్వీనర్‌ కోటాలోనే సీట్లు కేటాయిస్తారు. అదే ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు కోటాను బట్టి రూ.కోట్లలో వసూలు చేస్తుంటారు.

ప్రైవేటుకు అప్పగించేందుకు కుట్ర

రాష్ట్రంలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను అందుబాటులోకి తీసుకు రావాల్సిన కూటమి ప్రభుత్వం జగన్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో వాటిని ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. తద్వారా కార్పొరేట్‌ శక్తులకు ఆర్థిక లాభం చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

NAAC A Grade : ఈ డిగ్రీ క‌ళాశాల‌కు న్యాక్ ఏ గ్రేడ్‌..

నారాయణ, ఎన్‌ఆర్‌ఐల కోసమే

వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడమంటే మంత్రి నారాయణ, ఎన్‌ఆర్‌ఐల కోసమేనని అర్థమవుతోంది. ప్రభుత్వ ఆరో గ్య విద్యని నెలకొల్పుతామని, గత ప్రభుత్వం కన్నా మంచి చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. వైద్య విద్య ప్రైవేటీకరణ అజెండా ఆపకపోతే ఆందోళనలు చేస్తాం.

– ఎస్‌.కిరణ్‌కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌యూ

Published date : 15 Sep 2024 01:41PM

Photo Stories