Skip to main content

National Academy of Construction: ఆగస్టు 11న మినీ జాబ్‌మేళా

రాజమహేంద్రవరం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌ ఆవరణలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నేక్‌) భవనంలో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
 మినీ జాబ్‌మేళా
మినీ జాబ్‌మేళా

ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేళాకు ఎల్‌ఐసీ, సుస్వాదీప్‌, ఫ్లిప్‌కార్డ్‌ కంపెనీలు హాజరై, కంప్యూటర్‌ ఆపరేటర్‌, అడ్వైజర్‌, గోడౌన్‌ ఇన్‌చార్జి, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తాయి. పది, ఇంటర్‌, డిగ్రీ పాసైన 19 ఏళ్ల నుంచి 38 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కలవారు తమ పూర్తి వివరాలతో aprrdc.in నందు రిజిస్టర్‌ కావాలి. లేదా నేరుగా వేదిక వద్ద రిజిస్టర్‌ కావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 98487 29819, 91339 12947 నంబర్లను సంప్రదించాలి.

Also read: Admissions in Andhra University: యోగా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 08 Aug 2023 04:18PM

Photo Stories