Graduation Day: ఆర్ట్స్ కళాశాలలో రెండవ స్నాతకోత్సవం వేడుకలు..
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలోని యువతకు ఉన్నత విద్యనందించాలన్న లక్ష్యంతో 1948లో ఏర్పాటైన కళాశాలకు.. 1952లో అప్పటి ముఖ్యమంత్రి సర్ సి.వి. రాజగోపాలాచారి చేతుల మీదుగా పునాదిరాయి పడింది. నేడు అదే ప్రాంతంలో ఆకట్టుకునే భవన నిర్మాణాలతో ఆర్ట్స్ కళాశాలగా రూపుదిద్దుకుంది.
1967లోనే 2 (ఎఫ్), 12 (బి) హోదాను సాధించిన కళాశాలగా, 2003–04 సంవత్సరంలో తొలిసారిగా న్యాక్ గ్రేడ్ సాధించిన కళాశాలగా, 2012–13 సంవత్సరాలలో స్వయంప్రతిపత్తిని సాధించి ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా తీర్చిదిద్దిన చదువుల కోవెలలో స్నాతకోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు.
మద్రాసు ప్రభుత్వంలో 1948లో ఏర్పాటైన విద్యాలయం దాదాపు 75 సంవత్సరాల పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు విద్యాసుగంధాలు వెదజల్లుతూనే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనుబంధంతో ఏర్పాటైన ప్రభుత్వ పురుషుల కళాశాల ఆర్ట్స్ కళాశాలగా ప్రారంభమైంది. అనంతరం 1968లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా, 2008లో కడప యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. 2012–13లో స్వయంప్రతిపత్తి సాధించి అటానమస్ హోదాతో ప్రతియేటా దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులకు సేవలందిస్తోంది. 79 మంది అధ్యాపక బృందం (62 రెగ్యులర్, 13 కాంట్రాక్ట్, 4 గెస్ట్ లెక్చరర్లు)తో బోధన రంగం పటిష్టంగా ఉండటం విశేషం.
IIST Recruitment 2024: ఐఐఎస్‌ఎస్‌టీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోలు.. ఎవరు అర్హులంటే..
2వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
ఇప్పటి వరకు డిగ్రీ, పీజీ సర్టిఫికెట్‌లకు సంబంధించి విశ్వవిద్యాలయాలే స్నాతకోత్సవాలు నిర్వహించి పట్టాలు ప్రదానోత్సవం చేసేవారు. అయితే, ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో సైతం నిర్వహించేలా నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీంతో వరుసగా రెండో యేడాది గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ వేడుకల్లో 2022–23 విద్సాసంవత్సరాల్లో డిగ్రీ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు.
AP TRT & DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో 4,579 ఎస్‌ఏ/ఎస్జీటీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
కళాశాలలో 393 మంది పట్టాలు పొందేందుకు అర్హత సాధించగా, దాదాపు 200 మంది ప్రత్యక్షంగా బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే గ్రాడ్యుయేషన్ డేలో పట్టాలు అందుకోనున్నారు. వీరంతా స్నాతకోత్సవ వేడుకల్లాగా రోబ్స్ (నల్లని గౌన్లు) ధరించి అతిథుల చేతుల మీదుగా పట్టాలను అందుకోనున్నారు. మిగతా వారు పరోక్షంగా అందుకుంటారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, గౌరవ అతిథిగా ఏపీ కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, కడప ఆర్‌జేడీ డాక్టర్ పి. బాబు తదితరులు హాజరుకానున్నారు.
Teachers Training: ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాల శిక్షణ తప్పనిసరి..
కళాశాల వివరాలు ఇలా..
● 1948లో ప్రస్తుత జెడ్పీ ఆవరణంలో కళాశాల ఏర్పాటు.
● 1952లో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి సర్ సీవీ రాజగోపాలాచారి చేతుల మీదుగా పునాదిరాయికి శిలాఫలకం ఆవిష్కరణ.
● 1954లో గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలగా ప్రస్తుతం ఉన్న భవనాల్లో తరగతులు ప్రారంభం.
● 1967లో 2 (ఎఫ్), 12 (బి) హోదా.
● 1968లో తిరుపతి ఎస్వీయూకు అనుబంధం
● 1996లో జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల వేర్వేరు భవనాలు కేటాయింపు.
● 2003–04లో కళాశాలకు తొలిసారిగా న్యాక్ బి ప్లస్ గ్రేడింగ్
● 2008లో యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధం
● 2012–13 విద్సాసంవత్సరంలో స్వయంప్రతిపత్తి
● 2013లో న్యాక్ బి గ్రేడ్
● 2014లో చాయిస్‌బేస్డ్ క్రెడిట్ సిస్టం ఏర్పాటు
● 2013లో 2.76 జీపీఏతో బి గ్రేడ్
● 2019లో న్యాక్ బి గ్రేడ్.. (2024 వరకు)
నేడు 2వ గ్రాడ్యుయేషన్ డే
393 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం
Tenth Examinations: సబ్జెక్టు ప్రకారంగా ప్రణాళిక సిద్ధం.. విద్యార్థుల ప్రతిభే ముఖ్యం..!
విద్యార్థులకు గొప్ప అవకాశం
ప్రభుత్వ పురుషుల కళాశాలలో రెండవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది. ఈ వేడుకల్లో 393 మంది విద్యార్థులు పట్టాలు పొందేందుకు అర్హత సాధించారు. వీరిందరికీ అతిథుల చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నాం. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలకే పరిమితమైన ఈ ప్రక్రియను డిగ్రీ స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉంది.
– డాక్టర్ జి. రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప