Skip to main content

AP TRT & DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో 4,579 ఎస్‌ఏ/ఎస్జీటీ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌(టీఆర్‌టీ/డీఎస్సీ)–2024 నోటిఫికేషన్‌ను జారీచేసింది. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Commissioner of School Education notification   Government job opportunities  Government school jobs  AP TRT and DSC Notification 2024 and Exam pattern   Teacher recruitment test notification.

ఖాళీలున్న పాఠశాలలు: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్‌ కార్పొరేషన్, ట్రైబల్‌ వేల్ఫేర్‌.
పోస్టులు: స్కూల్‌ అసిస్టెంట్‌లు(ఎస్‌ఏ)–2,299, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ)–2,280.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగం/సబ్జెక్టులో ఇంటర్‌/డీఈఎల్‌ఈడీ, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులు.
వయసు: ఓసీలకు 2024 01.07.2024 నాటికి 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. 

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, రిజర్వేషన్‌ రూల్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా 122 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు విడతలుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించనున్నారు. ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.02.2024.
రాతపరీక్ష షెడ్యూల్‌: 15.03.2024 నుంచి 30.03.2024 వరకు

వెబ్‌సైట్‌: https://apdsc.apcfss.in/

చదవండి: AP TET 2024 Notification: నాలుగు పేపర్లుగా టెట్‌.. మెథడాలజీ, పెడగాజీలే మంచి మార్కులకు కీలకం... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Feb 2024 05:27PM

Photo Stories