Skip to main content

Teachers Training: ఉపాధ్యాయులకు కాంప్లెక్స్‌ సమావేశాల శిక్షణ తప్పనిసరి..

కడప నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు..
Teachers complex meetings for every month

సాక్షి ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌ సమావేశాలకు తప్పని సరిగా హాజరై శిక్షణ పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారి మర్రెడ్డి అనురాధ అన్నారు. మంగళవారం కడప నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్‌లో నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌ సమావేశాల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌ సమావేశాలు కేటాయించిన షెడ్యూల్‌ ప్రకారం జరగాలని ఆదేశించారు.

Tenth Examinations: సబ్జెక్టు ప్రకారంగా ప్రణాళిక సిద్ధం.. విద్యార్థుల ప్రతిభే ముఖ్యం..!

శిక్షణ సమయంలో ఉపాధ్యాయులెవరూ సెలవుగానీ, పర్మీషన్‌గానీ పెట్టరాదని, ఎంఈఓలు వాటికి అనుమతి ఇవ్వరాదని చెప్పారు. అనంతరం తరగతి గదిలో పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించడంతోపాటు పరీక్షలపై పలు సూచనలు సలహాలను ఇచ్చారు.

Published date : 21 Feb 2024 05:15PM

Photo Stories