Skip to main content

Library Science Courses: ఈ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..

విద్యార్థుల‌కు గ్రంథాల‌య శాస్త్ర కోర్సుల‌కు శిక్ష‌ణ పొందేందుకు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని శిక్ష‌ణాల‌యం ప్రిన్సిపాల్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. శిక్ష‌ణ, ద‌ర‌ఖాస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు..
Announcement of library science course applications, Principal disclosing training specifics for students,Training school coursesStudents applying for library science training, Training details for library science applications, Applications open for library science courses,Principal discussing library science courses,
Applications open for library science courses

సాక్షి ఎడ్యుకేష‌న్: సాక్షి ఎడ్యుకేష‌న్: గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్‌ కోర్సు శిక్షణ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాతూరి నాగభూషణం గ్రంథాలయ శిక్షణాలయం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రావి శారద గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

➤   Kabaddi Selections: క‌బ‌డ్డీ తుది జ‌ట్టు ఎంపిక‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గుర్తింపుతో డిసెంబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సుకు 18 ఏళ్లు నిండిన ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని, 5 నెలల పాటు జరిగే ఈ శిక్షణ తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుందని, ప్రభుత్వ రిజర్వేషన్లు పాటిస్తూ ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తామని తెలిపారు. ఇది రెగ్యులర్‌ కోర్సు కాబట్టి అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులు ప్రతిరోజూ తరగతులకు రావాలని, శిక్షణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని తెలిపారు.

➤   Acharya K Samatha: ఏయూలో లిక్విడ్‌క్రిస్టల్స్‌పై పరిశోధనలు

దరఖాస్తులు, ఇతర వివరాలకు ప్రిన్సిపాల్‌, పాతూరి నాగభూషణం స్కూల్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌, శ్రీ సర్వోత్తమ భవనం, విజయవాడ పేరుతో రూ.10 మనీఆర్డర్‌ పంపాలని, లేదా నేరుగా అభ్యర్థులు నేరుగా వచ్చి రూ.5 చెల్లించి దరఖాస్తు పొందవచ్చని అన్నారు. వివరాలకు 0866–2472313, 9290670671 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు.

Published date : 04 Nov 2023 09:27AM

Photo Stories