Kabaddi Selections: కబడ్డీ తుది జట్టు ఎంపిక
సాక్షి ఎడ్యుకేషన్: అండర్–19 ఎస్‌జీఎఫ్ జిల్లా కబడ్డీ తుది జట్టును గురువారం స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ ఆవరణలో ఎంపిక చేశారు. ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొడ్డు సుబ్బారావు, ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ చీరాలలో ఇటీవల ప్రాబబుల్ లిస్టు తయారు చేసి వారిలో ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేసినట్లు చెప్పారు.
➤ Science Congress Competitions: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సైన్స్ కాంగ్రెస్ పోటీలు
ఎంపికైన వారు జిల్లా ఖ్యాతిని నిలబెట్టేలా రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఎంపిక కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో ఏబీఎం కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీవాణి, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లతో పాటు పలు అసోసియేషన్ల ప్రతినిధులు ఉన్నారు.
➤ Physical Education: ‘వ్యాయామ విద్య’కు పెద్దపీట
ఎంపికైన జిల్లా జట్టు...
జి.బాలాజీ (కెప్టెన్), లక్ష్మీతిరుపతయ్య, ఎ.రాజు, డి.గోపిరాజు, యు.సాగర్, జి.లక్ష్మణ్, ఆర్.లీలావెంకట్, పవన్, బి.హరినాథ్, కె.బాలాజీ, బి.మునినాయక్, కె.ఆంజనేయులు, కె.సాయిరాం, జి.అశోక్.