Skip to main content

NEET & IIT Free Coaching: విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ-నీట్ శిక్ష‌ణ‌.. పూర్తి వివరాలివే!

దేవరాపల్లి: సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ, నీట్‌ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయాధికారి ఎస్‌.రూపావతి తెలిపారు.
Announcement of IIT and NEET coaching for Gurukul students   NEET & IIT Free Coaching  Announcement of IIT and NEET coaching for Gurukul students
NEET & IIT Free Coaching

తెనుగుపూడి బాలుర గురుకుల విద్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంట ర్మీడియెట్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఐఐటీ, నీట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Job Mela: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, ఉత్తరాంధ్రకు చెందిన బాలురకు విశాఖ నగరంలో గల శ్రీకృష్ణాపురం గురుకుల కళాశాలలో, బాలికలకు చీపురుపల్లి బాలికల విద్యాలయంలో సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

NIFT Admissions 2025 : నిఫ్ట్‌లో మాస్టర్స్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

వారికి ఇంటర్‌ విద్యతో పాటు ఐఐటీ, నీట్‌ ప్రవేశ పరీక్ష రాయడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడానికి వీలుగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Dec 2024 10:10AM

Photo Stories