Skip to main content

NIFT Admissions 2025 : ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.... చివరి తేదీ ఇదే

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌).. దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్‌ సెషన్‌ 2025–26కు సంబంధించి మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
NIFT Admissions 2025  NIFT Masters degree admission 2025-26   NIFT Masters degree courses admission details
NIFT Master of Fashion Technology NIFT Master of Fashion Management NIFT Master of Design Admission

నిఫ్ట్‌ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జోద్‌పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్, వారణాసి.

»    కోర్సుల వివరాలు
మాస్టర్స్‌ కోర్సులు:

NIFT Master of Design Admission 2025 Notification  National Institute of Fashion Technology (NIFT) M.Des Programmes 2025 Admission Announcement
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌; సీట్లు- 90
వ్యవధి: రెండేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా నిఫ్ట్‌ లేదా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఉత్తీర్ణత.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

NIFT Master of Fashion Management Admission 2025 Notification   NIFT MFM 2025 Admission Notification  Apply for NIFT MFM 2025 Programme  National Institute of Fashion Technology MFM 2025 Admission

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌; సీట్లు-390
వ్యవధి: రెండేళ్లు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్‌/నిడ్‌ నుంచి మూడేళ్ల యూజీ డిప్లొమా ఉత్తీర్ణత.

NIFT Master of Fashion Technology Admission 2025 Notification   NIFT M.F.Tech 2025 Admission Announcement Master of Fashion Technology Admission 2025 at NIFT  Apply for NIFT M.F.Tech 2025 Admissions

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ; సీట్లు - 100
వ్యవధి: రెండేళ్లు
అర్హత: నిఫ్ట్‌ లేదా ఇతర గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.
వయోపరిమితి: మాస్టర్స్‌ కోర్సులకు వయోపరిమితి లేదు.

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

ముఖ్యమైన తేదీలు..

మాస్టర్స్‌ కోర్సులు

»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.01.2025.
»    దరఖాస్తుల సవరణ తేది: 10.01.2025 నుంచి 12.01.2025 వరకు.
»    అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేది: జనవరి మూడో వారం 2025.
»    ప్రవేశ పరీక్ష తేది: 09.02.2024.
»    సిట్యుయేషన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ/డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌: ఏప్రిల్, 2025.
»    వెబ్‌సైట్‌: www.nift.ac.in/admission

Published date : 10 Dec 2024 10:24AM
PDF

Photo Stories