Skip to main content

Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఎలా అంటే..

దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌లలో అకడమిక్ సెషన్ 2024-25కు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) దరఖాస్తులు కోరుతోంది.
NIFT Bachelor of design admission   National Institute of Fashion Technology Admission 2024-25

పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. యూజీ ప్రోగ్రామ్‌కు 10+2 పరీక్షలో ఉత్తీర్ణత, పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్‌, బీఈ, బీటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై వారు అర్హులు. యూజీకి 24 సంవత్సరాల వ‌యో ప‌రామితి ఉండ‌గా, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(B.Des)కు https://exams.nta.ac.in/NIFT/ ద్వారా అప్లై చేసుకోవ‌చ్చు. 

నిఫ్ట్‌ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జోద్‌పూర్, కాంగ్రా, కన్నూర్, ముంబై, న్యూఢిల్లీ, పాటా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్‌.

Department Wise APPSC Group 2 Jobs Vacancies List 2023 : 59 విభాగాల్లో.. 897 గ్రూప్‌-2 పోస్టుల‌ను భ‌ర్తీ.. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?

కోర్సుల వివరాలు.. 
బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌:
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌(బీడీఈఎస్‌): ఫ్యాషన్‌ డిజైన్‌/లెదర్‌ డిజైన్‌/యాక్సెసరీ డిజైన్‌/టెక్స్‌టైల్‌ డిజైన్‌/నిట్‌వేర్‌ డిజైన్‌/ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌.
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(బీఎఫ్‌టెక్‌)ప్రోగ్రామ్‌.

మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌ (ఎండీఈఎస్‌); మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌(ఎంఎఫ్‌ఎం); మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(ఎంఎఫ్‌టెక్‌).

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ (డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ):

వివ‌రాలు..
▶ యూజీ, పీజీ ప్రోగ్రామ్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ 03-01-2024.
▶ రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్లూడీ అభ్యర్థులకు రూ.1500 ఉంటుంది.
▶ ఆలస్య రుసుము రూ.5000తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జ‌న‌వ‌రి 4, 2023  నుంచి 8వ తేదీ వరకు ఉంటుంది.

IB ACIO Notification 2023: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 995 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..

▶ 10-01-2023 నుంచి 12-01-2023 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం. 
▶ జనవరి మూడో వారం, 2024 వ‌ర‌కు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఉంటుంది.
▶ డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష 05-02-2024న ఉండ‌గా, మార్చిలో ఫలితాల వెల్లడి ఉంటుంది.
▶ ఏప్రిల్, 2024లో సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూ

పీహెచ్‌డీ ప్రోగ్రామ్ వివ‌రాలు..
▶ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ 15-01-2024న ప్రారంభం.
▶ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 29-02-2024.
▶ ఏప్రిల్ రెండో వారంలో దరఖాస్తుల సవరణ, చివరి వారంలో అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్ ఉంటుంది.
▶ మే నెల‌ మొదటి వారంలో రాత పరీక్ష, ఫలితాలు మే చివరి వారంలో రానున్నాయి.
▶ జూన్ నెల మూడో వారంలో రిసెర్చ్‌ ప్రపోజల్‌ ప్రజెంటేషన్‌, ఇంటర్వ్యూ ఉండ‌గా, జులై రెండో వారంలో ఫలితాల ప్రకటన ఉంటుంది. 

వెబ్‌సైట్: https://www.nift.ac.in/admission

Published date : 09 Dec 2023 10:27AM

Photo Stories