ISRO Training: పీజీ విద్యార్థులకు ఇస్రో శిక్షణ
సాక్షి ఎడ్యుకేషన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అందించే శిక్షణ పీజీ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ పేర్కొన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసి అందులో పీజీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులకు ‘స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్‌నెస్ ట్రైనింగ్’ ఆన్‌లైన్ ద్వారా 18 రోజుల పాటు నిర్వహించింది.
Intermediate Results: విద్యార్థులకు ఇంటర్ సర్టిఫికెట్లు
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న 32 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం వైవీయూలోని సీవీ రామన్ సైన్స్‌బ్లాక్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్రో వైవీయూ నోడల్ అధికారి, భౌతికశాస్త్ర విభాగాధిపతి ఆచార్య కె.కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి, భౌతికశాస్త్ర అధ్యాపకులు వెంకటరాము, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.