Intermediate Results: విద్యార్థులకు ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి ఎడ్యుకేషన్: ఈ ఏడాది మార్చి, మే నెలల్లో ఇంటర్ పరీక్షల్లో పాసైన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల జాబితాలు వచ్చాయని, విద్యార్థులు కళాశాలలకు వెళ్లి తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.రాధిక చెప్పారు. సోమవారం కళాశాల ఆవరణలో విద్యార్థులకు మార్కుల జాబితా అందజేశారు. విద్యార్థి మొబైల్ ఫోన్‌లో డిజి లాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కూడా మార్కుల జాబితా సాఫ్ట్‌కాపీ పొందవచ్చని ఆమె చెప్పారు.
Intermediate Students: 12లోగా ఇంటర్ సర్టిఫికెట్లు అందజేయాలి
జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి బి.సుజాత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అపరాధరుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పెంచిందని ఆమె తెలిపారు. ఆయా విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులకు హాజరు కావచ్చని ఆమె చెప్పారు.