Science Congress: జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు కేవీ విద్యార్థులు
Sakshi Education
మచిలీపట్నంటౌన్: జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మొహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ నవంబర్ 1న తెలిపారు.
విశాఖపట్నం శ్రీ విజయ నగర్ కేంద్రీయ విద్యాలయం–1లో అక్టోబర్ 31న జరిగిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాంతీయస్థాయి పోటీల్లో ఏడో తరగతి విద్యార్థినులు ఆర్.హర్షిత గౌడ్, టి.రితిక పాల్గొన్నారన్నారు.
చదవండి: Science Exhibition: ఉత్తమ ప్రదర్శనకు పురస్కారం..
సైన్స్ ఉపాధ్యా యిని కె.సాహిత్య పర్యవేక్షణలో ఈ విద్యార్థులు సెల్‌ఫోన్ వాడకం తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు పెరట్లో సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తుల పెంపకం అనే అంశంపై చేసిన ప్రాజెక్టు సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికై ందన్నారు. సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది నవంబర్ 1న అభినందించారు.
Published date : 02 Nov 2023 12:54PM