National Children's Science Congress: మన విద్యార్థుల ప్రతిభ
సుస్థిరమైన జీవనం కోసం విజ్ఞాన శాస్త్రం.. అనే అంశంపై ఈ రెండు ప్రాజెక్టులు ఎంపికైనట్టు తెలిపారు. విజయవాడలో మండలి కార్యాలయంలో ఫిబ్రవరి 25న ఆమె మీడియాతో మాట్లాడారు. 2021–22 సంవత్సరానికి జాతీయ బాలల సమ్మేళనం ప్రతిపాదించిన ఐదు అంశాలకు సంబంధించి రాష్ట్రం నుంచి 17 ప్రాజెక్టులను పంపామన్నారు. కృష్ణా జిల్లా పెడన వీజీకే జెడ్పీ హైస్కూల్‌కి చెందిన మోహనదుర్గా మణికంఠ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో చేసిన పర్యావరణ పూల కుండీల కాన్సెప్‌్టకు బహుమతి వచి్చందన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ కుండీలు భూమిలో కలిసిపోతాయన్నారు. అలాగే ప్రకాశం జిల్లా బల్లికురవ జెడ్పీ హైసూ్కల్‌కు చెందిన విద్యార్ధినులు జెస్సీకా, యామిని తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగులకు మరో బహుమతి వచ్చినట్టు అపర్ణ తెలిపారు.
చదవండి:
Professor Jagdish: యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం చేస్తాం