Tenth Class: సిలబస్ను 70 శాతాం.. పరీక్షా సమయం పెంపు..
కరోనా వల్ల జరి గిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఫిబ్రవరి 24న ఆమె డీఈవోలుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించా లని సూచించారు. సిలబస్‌ను 70 శాతానికి పరి మితం చేయడం, పరీక్షా సమయాన్ని పెంచడం, చాయిస్ పెంచడం, ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం వంటి మార్పులపై విద్యార్థులకు అవగా హన కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన మన ఊరు–మనబడి, ఇంగ్లిష్ మీడి యం విద్య రాబోయే కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆమె అన్నారు. స్కూళ్ల నిర్మాణం, మరమ్మతుల విషయంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఇంజనీర్లకు సూచిం చారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండి పార్థసారథి పాల్గొన్నారు.
చదవండి: