Skip to main content

JEE Main 2022: నోటిఫికేషన్, పరీక్షల సమాచారం

ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ ఐటీ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2022 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
JEE Main 2022
జేఈఈ మెయిన్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ ఐటీ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్ర¯Œ్స ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2022 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.నోటిఫికేషన్

2021లో కరోనా కారణంగా నాలుగు దఫాలుగా మెయిన్ పరీక్షలు నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎ న్టీఏ), కరోనా సద్దుమణగడంతో ఈసారి రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించనుంది. మార్చి మొదటివారంలో రిజి్రస్టేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మార్చి ఆఖరు వరకు రిజి్రస్టేషన్లకు అవకాశం కల్పించి ఏప్రిల్‌లో మొదటి విడత, మేలో రెండో విడత పరీక్షలు పూర్తి చేస్తారు. మేలోనే ఆన్సర్‌ కీలను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. 2020, 2021 విద్యా సంవత్సరాలలో ఇంటరీ్మడియెట్‌ పాసైన విద్యార్థులు, 2022లో ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి అర్హులు. జేఈఈ మెయిన్ –2022 వెబ్‌సైట్‌ను కూడా ఎన్టీఏ సిద్ధం చేసింది. కొత్త వెబ్‌సైట్‌ను వివిధ విభాగాలు, ఆర్కివ్‌లు విద్యార్థులకు సులభంగా యాక్సెస్‌ అయ్యేలా రూపొందించింది. ఇందులో విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని, జేఈఈ నిబంధనలను తెలుసుకోవచ్చు. పాత ప్రశ్నపత్రాలు, సమాధానాల కీలను కూడా పొందుపరిచింది. మెయిన్ అనంతరం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్‌ పరీక్షను జూలై 3న నిర్వహించనున్నట్లు ఐఐటీ బోంబే ప్రకటించింది. మెయిన్ లో అర్హత పొందిన వారు అడ్వాన్స్ డ్‌కు జూన్ 8 నుంచి 14 వరకు రిజి్రస్టేషన్ చేసుకోవాలి. జూలై 18న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ మరుసటి రోజు నుంచే జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తారు. 

చదవండి: 

JEE Main and Advanced Guidance

JEE 2022: మెయిన్, అడ్వాన్స్ డ్‌ షెడ్యూల్‌పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ

JEE Advanced 2021 : మా లక్ష్యం ఇదే..మా స‌క్సెస్ సీక్రెట్స్ ఇవే..

NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

JEE Main: జేఈఈలో మెరిసిన తెలుగుతేజాలు

Published date : 26 Feb 2022 12:30PM

Photo Stories