Skip to main content

Science Exhibition: ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌కు పుర‌స్కారం..

ఇటీవ‌లె నిర్వ‌హించిన విద్యా వైజ్ఙానిక ప్ర‌ద‌ర్శ‌న‌లో వివిధ విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఉత్తమ ప్ర‌ద‌ర్శించినలు ఎంపిక చేశారు. బ‌హుమానాలు అంద‌జేశారు. పోటీకి సంబంధించి పూర్తి వివ‌రాలు..
Deputy EO's Vasudeva Rao and Brahmaji Rao presenting certificates
Deputy EO's Vasudeva Rao and Brahmaji Rao presenting certificates

సాక్షి ఎడ్యుకేష‌న్: విజయనగరం ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విజేతలను మంగళవారం విద్యా శాఖ ప్రకటించింది. ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రాంతాల పాఠశాలల నుంచి 11, జూనియర్‌ కళాశాలల నుంచి 10, ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి 4 ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. వీటిలో ఉత్తమమైన 11 ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసిన వారికి ప్రశంసాపత్రం, జ్ఞాపికలను డిప్యూటీ ఈఓ వాసుదేవరావు, బ్రహ్మాజీరావు అందజేసారు.

➤   Training for Teachers: ఉపాధ్యాయుల‌కు 'జ్ఞాన జ్యోతి' శిక్ష‌ణ ప్రారంభం

ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికైన వాటిలో రామతీర్ధం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రామభద్రపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఫోర్ట్‌ సిటీ స్కూల్‌ విజయనగరం, రెల్లివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మహరాజా ఉన్నత పాఠశాల విజయనగరం, కొత్తవలస ఎంపీయూపీ స్కూల్‌, నెల్లిమర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్‌ఎంఆర్‌పీఆర్‌సీ ఉన్నత పాఠశాల విజయనగరం, భాష్యం హైస్కూల్‌ విజయనగరం ప్రాజెక్టులు ఉన్నాయి.

Published date : 01 Nov 2023 05:18PM

Photo Stories