Entry Exit System : వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి ఎంట్రీ ఎగ్జిట్ విధానం..!!

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం 2025-26 నుంచి పలు డిగ్రీ కోర్సుల్లో ఎంట్రీ ఎగ్జిట్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో, బీకాం, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ వంటి కోర్సులు ఉన్నాయి. ఇందులో ఈ విద్యాసంవత్సరం నుంచే ఎంట్రీ-ఎగ్జిట్ విధానం అమలు చేయనున్నారు. దీనికి, ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు కూడా చేసింది.
నిపుణుల కమిటీ..
ఈ విధానంలో భాగంగా, కోర్సుల్లో విద్యార్థులకు సిలబస్‌ను ఆధునికీకరించి, కొత్త పాఠ్య ప్రణాళికను అమలు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని కూడా నియమించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా బాలకిష్టారెడ్డి..
PM Shri Scheme : పాఠశాలల్లో పీఎం శ్రీ పథకానికి మరోసారి శ్రీకారం..
హెచ్‌సీయూ నుంచి బెల్లంకొండ రాజశేఖర్, ఓయూ నుంచి విద్యాధర్‌రెడ్డి, జేఎన్‌టీయూహెచ్ నుంచి సింధు, ఓయూ నుంచి అప్పారావు, ఎంజీయూ నుంచి రమేశ్‌కుమార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్-హైదరాబాద్ నుంచి ఎస్ రాజేశ్వర్‌రావు.. ఉన్నత నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
సర్కార్ అనుమతి..
నూతన కమిటీని నియమించిన తరువాత మంగళవారం, ఫిబ్రవరి 25వ తేదీన తొలి సమావేశంలో భాగంగా, చర్చలు జరిపారు. ఇందులో, కామర్స్, మేనేజ్‌మెంట్, లా కోర్సుల సిలబస్‌లో వారు చేయాలనుకున్న మార్పులపై కీలక చర్చల అనంతరం.. ఒక నివేదికను రూపోందించింది.
Holiday News for Students : శుభవార్త.. నేడు విద్యాసంస్థలకు సెలవు.. ఈ జిల్లాల్లోనే..
ఏడాది తర్వాత పలు కారణాల వల్ల చదువు కొనసాగించలేకపోయినా.. మరోసారి చేరేలా ఈ విధానాన్ని కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది. ఇక, ఈ విధానాన్ని సర్కార్ సమర్థిస్తే.. రానున్న విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- entry and exit system
- bachelor degree syllabus
- Higher Education Council
- new committee
- changes in syllabus
- Reports on syllabus changes
- state higher education council
- Telangana Government
- colleges
- entry and exit system in degree courses
- Modernize in syllabus
- new syllabus for degree and law students
- Education News
- Sakshi Education News