Skip to main content

YSRUHS: మెడిసిన్‌లో బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభమవుతున్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలతో­పాటు స్విమ్స్, ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల్లో 2023–­24 విద్యా సంవత్సరానికి బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ­విద్యా­లయం ఆగ‌స్టు 3న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
YSRUHS
మెడిసిన్‌లో బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఈ మేరకు నీట్‌ యూజీ–2023లో అర్హత సాధించిన విద్యా­ర్థులు ఆగ‌స్టు 4న‌ ఉదయం పది గంటల నుంచి ఆగ‌స్టు 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

https://­ugmq.­ysruhs.com వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ అప్లి­కే­షన్‌ అందుబాటులో ఉంటుంది. నియమాలు, నిబంధనలపై స్పష్టత కోసం 897­8780501, 7997710168, 939­1­8­05238, సాంకేతిక సమస్యలపై 74165­6­3063, 7416253073, పేమెంట్‌ గేట్‌­వే­లో స్పష్టత కోసం 8333883934 నంబర్‌లను విద్యార్థులు సంప్రదించ­వ­చ్చు.

చదవండి: KNRUHS: కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌

నీట్‌ యూజీలో వచ్చిన ర్యాంక్‌ల ఆధా­ర­ంగా నిబంధనలకు లోబడి సీట్ల కేటా­యి­ంపు ఉంటుందని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధి­కారెడ్డి తెలిపారు. సీటు వచ్చేలా చేస్తామని కొందరు వ్యక్తులు చెప్పే మా­య­మాటలు నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని ఆమె స్పష్టంచేశారు.

చదవండి: Medical College: మెడికల్‌ కాలేజీ పనులు పూర్తిచేయాలి

Published date : 04 Aug 2023 01:35PM

Photo Stories