KNRUHS: కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్
ఆగస్టు 4 నుంచి 6 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 4వ తేదీ ఉదయం 6 గంటల నుండి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితాతో పాటు కాలేజీల వారిగా సీట్ల వివరాలను వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.
చదవండి: Medical college: ఆగస్టు 15లోగా వైద్య కళాశాల తుది దశ పనులు పూర్తి
మైనారిటీ కాలేజీల్లో సీట్లు కేవలం మైనారిటీ విద్యార్థులకే
మైనారిటీ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటా సీట్లు కేవలం ముస్లిం మైనారిటీ అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తారు. ముస్లిం మైనారిటీ అభ్యర్థులు ఇతర మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా అర్హులు.
అభ్యర్థికి సీటు కేటాయించినా కోర్సులో చేరకపోతే, సీట్ బ్లాకింగ్‌ను నివారించడానికి తదుపరి దశల కౌన్సెలింగ్‌లు, వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించుకోవడానికి అనుమతించరు.