Skip to main content

Medical college: ఆగస్టు 15లోగా వైద్య కళాశాల తుది దశ పనులు పూర్తి

చిలకలపూడి(మచిలీపట్నం): వైద్యకళాశాల తుది దశ నిర్మాణ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు అధికారులకు ఆదేశించారు. ఆయన చాంబర్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న మచిలీపట్నం వైద్యకళాశాలలో మౌలిక సదుపాయాలను వేగవంతంగా సమకూర్చాలన్నారు. డిపార్ట్‌మెంట్‌ రూమ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఎగ్జామినేషన్‌ హాలు, వసతిగృహాలు తదితర భవనాల్లో పెయింటింగ్‌ పనులు విద్యుద్దీకరణ పూర్తి చేయాలన్నారు. ఆడియో, వీడియో పరికరాల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, హాస్టల్‌ బ్లాక్‌ల నిర్మాణం గడువులోగా పూర్తి చేస్తామని ఇంజినీరింగ్‌ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

Also read: AMC 2023: ఆంధ్ర వైద్య కళాశాలలో అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే..

నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఇంటీరియర్‌ పరికరాలు అమర్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకుండా నాణ్యత కలిగిన మెటీరియల్‌ను ఉపయోగించాలన్నారు.

పారదర్శకంగా..

వైద్యకళాశాల నిర్మాణ పనులకు సంబంధించి సమాచారాన్ని పారదర్శకంగా తెలియజేసేందుకు వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. రోజువారీ పనుల పురోగతిని ఆ గ్రూప్‌లో పొందుపరచాలన్నారు.

Also read: SSC CPO Notification 2023: 1876 SI పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు

అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న, చిన్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ. కిశోర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జి. చంద్రయ్య, మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధి జగదీష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సత్యనారాయణరాజు, కళాశాల డీఈఈ ఎం. నళిని, డెప్యూటీ మేనేజర్‌ ఎ. శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also read: CM Jagan Good News: Benefits for AP MBBS Aspirants | 100% Seats #sakshieducation

అధికారులకు కృష్ణా జిల్లా

కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

Published date : 01 Aug 2023 02:51PM

Photo Stories