Medical College: మెడికల్ కాలేజీ పనులు పూర్తిచేయాలి
![Medical college work should be completed](/sites/default/files/images/2023/08/02/01knt351-180089mr-1690965192.jpg)
వైద్య కళాశాల తరగతి గదుల కోసం కొత్తపల్లి శివారులోని విత్తనశుద్ధి కర్మాగార గోదాముల్లో చేపడుతున్న ఆధునీకరణ పనులతో పాటు జిల్లా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆగష్టు 1న పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా గాలి, వెలుతురు స్పష్టంగా ఉండేలా చూడాలని సూచించారు.భోజనం, అల్పాహారం కోసం మెప్మావారితో క్యాంటిన్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ఓపీ, జనరల్ వార్డు, ప్రసూతి విభాగం, రేడియాలజీ, డయోగ్నోస్టిక్ తదితర విభాగాలను పరిశీలించారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు పరిశీలించారు. సామ్, మామ్ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, అడిషనల్ డీఎంహెచ్‌వో సుజాత, ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషన్ ప్రసాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినారాయణ, ఆర్‌ఎంఓ జ్యోతి, అడిషనల్ ఆర్‌ఎంవో నవీన పాల్గొన్నారు.
చదవండి: NEET UG Counselling: ఆ మెడికల్ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చారా... అయితే మీ సీటు గోవిందా...!