NEET UG Counselling: ఆ మెడికల్ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చారా... అయితే మీ సీటు గోవిందా...!
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. కాలేజీలు, సీట్ల వివరాలను జూలై 20వ తేదీన ఎంసీసీ, ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అదే రోజు ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
జూలై 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, వెబ్ ఆప్షన్ల గడువు ముగిసిన తర్వాత ఓ మెడికల్ కాలేజీ చావుకబురు చల్లగా చెప్పింది.
తమ కాలేజీకి సంబంధించి 2023-24 విద్యా సంవత్సరానికి ఎన్ఎంసీ నుంచి గుర్తింపు లభించలేదని కాంచీపురంలోని మీనాక్షి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఒకవేళ అభ్యర్థులు తమ కాలేజీని ఆప్షన్లగా ఇస్తే మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్ల ప్రాసెసింగ్ చేయమని చేతులెత్తేసింది.
NEET 2023 Ranker : 11 ఏళ్లకే పెళ్లి... 20 ఏళ్లకు పాప... ఐదో ప్రయత్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ
ఒకవేళ పొరపాటున ఎవరైనా విద్యార్థులు మీనాక్షి కాలేజీలో వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లైతే ఆగస్టు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్న సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.