Skip to main content

NEET UG 2024: మరో రెండు రోజుల్లో నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌.. అక్కడ సీటు కావాలంటే భారీగా ఫీజు

NEET UG Counselling 2024 Counselling  NEET UG counseling process begins state-wise State medical board issues fee notification for MBBS courses High fees for MBBS courses in state medical colleges  NEET UG counseling process updates and fee details

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ రాష్ట్రాల వారీగా ప్రారంభమయ్యింది. జాతీయ స్థాయిలో ఆగస్టు 14న ఇది ప్రారంభం కానుంది. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చేయాలంటే భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర  మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Engineering Colleges: మేనేజ్‌మెంట్‌ కోటాలో భారీగా డబ్బులు వసూలు.. హైకోర్టు తీర్పుతో తలకిందులు, డబ్బులు వెనక్కి ఇస్తారా?

పంజాబ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మెడికల్‌ కాలేజీలలో ఎంబీబీఎస్‌ కోర్సు ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. అడ్మిషన్లను నియంత్రించేందుకే మెడికల్ ఫీజులను ఐదు శాతం మేరకు పెంచినట్లు అధికారిక నోటిఫికేషన్‌లో తెలియజేశారు.

బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో 1,550 సీట్లలో ప్రవేశాలు ఉంటాయని, వీటిలో 750 సీట్లు రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీలలో, 800 సీట్లు మైనారిటీ రాష్ట్రాల్లోని నాలుగు ప్రైవేట్, రెండు మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉన్నాయనిమెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. పంజాబ్‌లో ఇప్పటికే నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మూడు వేల పోస్టుల భర్తీ

నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం అమృత్‌సర్‌, ఫరీద్‌కోట్‌, పటియాలా, మొహాలీలలోని నాలుగు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ఫీజును రూ.9.50 లక్షలకు పెంచారు. గతంలో ఇక్కడ ఫీజు రూ.9.05 లక్షలుగా ఉండేది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని అన్ని మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ఎంబీబీఎస్ కోర్సుకు గతంలో రూ.55.28 లక్షలుగా ఉన్న పూర్తి ఫీజును రూ.58.02 లక్షలు చేశారు. కాగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ కోటాలోని ఎంబీబీఎస్ సీట్ల ఫీజు గతంలో రూ.21.48 లక్షలుగా ఉండగా, దానిని ఇప్పుటు రూ.22.54 లక్షలకు పెంచారు.

Published date : 12 Aug 2024 01:07PM

Photo Stories