NEET UG 2024 Counselling : నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ ఆగస్ట్ 14 నుంచి ..
Sakshi Education
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్ట్ 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్ట్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌పై అప్‌డేట్స్‌ను ఎంసీసీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక నోటీసు విడుదల చేసింది.
Published date : 30 Jul 2024 12:39PM