Skip to main content

NEET 2021: కౌన్సెలింగ్‌ విధివిధానాలు.. అవసరమైన సర్టిఫికెట్లు.. సీట్లు తదితర వివరాలు..

Medical Counseling Procedures
Medical Counseling Procedures

నీట్‌–యూజీ.. మెడికల్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష! నీట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్‌ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఇందుకోసం రెండు రకాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు!! జాతీయ స్థాయిలో.. ఆల్‌ ఇండియా కోటా పేరుతో అందుబాటులో ఉండే సీట్లకు.. డీజీహెచ్‌ఎస్‌ నేతృత్వంలోని ఎంసీసీ కౌన్సెలింగ్‌ చేపడుతుంది! అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలోని సీట్ల భర్తీకి హెల్త్‌ యూనివర్సిటీలు ప్రత్యేకంగా మరో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి! తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. దేశంలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ విధివిధానాలు.. అవసరమైన సర్టిఫికెట్లు.. అందుబాటులోని సీట్లు తదితర వివరాలు..  

  • ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశ ప్రక్రియకు సన్నాహాలు 
  • త్వరలో ఆల్‌ ఇండియా కోటా నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌కు అవకాశం
  • ఆల్‌ ఇండియా కోటా(ఐఏక్యూ), హెల్త్‌ వర్సిటీల నేతృత్వంలో రెండు రకాల కౌన్సెలింగ్‌ 
  • ఐఏక్యూతో జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం
  • తెలంగాణలో మెడికల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌–యూజీ 2021కు మొత్తం 16,14,777 మంది దరఖాస్తు చేసుకోగా.. 95.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8,70,074 మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 80వేల
మంది వరకు అర్హత సాధించి ఉంటారని అంచనా. నీట్‌ స్కోర్‌ ఆధారంగా సొంత రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలంటే.. రెండు కౌన్సెలింగ్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకొని.. సదరు ప్రవేశ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. 

ఆల్‌ ఇండియా కోటా, స్టేట్‌ కోటా

నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో రెండు విధానాలు అమలవుతున్నాయి. ఆల్‌ ఇండియా కోటా పేరుతో జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అదేవిధంగా స్టేట్‌ కోటా పేరుతో..ఆయా రాష్ట్రాల్లోని హెల్త్‌ యూనివర్సిటీలు లేదా సంబంధిత అధికారిక వర్గాలు
కౌన్సెలింగ్‌ చేపడతాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టేట్‌ కోటా కౌన్సెలింగ్‌ను తెలంగాణలో కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు నిర్వహిస్తాయి.

ఆల్‌ ఇండియా కోటా.. ఇలా

  • ఈ విధానం ప్రకారం–జాతీయస్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్‌ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్‌ఎస్‌కు చెంది న మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నిర్వహిస్తుంది. 
  • దీని ద్వారా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోని మెడికల్, డెంటల్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉన్న 15 శాతం సీట్లతోపాటు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఎయిమ్స్‌ క్యాంపస్‌లు, జిప్‌మర్‌(పుదుచ్చేరి, కరైకల్‌ క్యాంపస్‌లు), అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలోని మొత్తం సీట్లు; ఢిల్లీ యూనివర్సిటీ, ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, వర్ధమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజ్, ఏబీ వాజ్‌పేయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉండే 85శాతం సీట్లు; జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ డెంటిస్ట్రీలోని 100 శాతం సీట్లు; ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌లో ఐపీ కోటా పేరుతో అందుబాటులో ఉండే స్టేట్‌ కోటాకు సంబంధించి 15 శాతం సీట్లు భర్తీ చేస్తారు. 
  • జాతీయ స్థాయిలోని మెడికల్‌ కళాశాలల్లో సీటు పొందాలనుకునే విద్యార్థులు ఎంసీసీ నిర్వహిం చే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • జాతీయ స్థాయిలో 83,075 ఎంబీబీఎస్‌ సీట్లు, 26,949 బీడీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 15 శాతం సీట్లకు ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అదే విధంగా ఎయిమ్స్, జిప్‌మర్‌లలోని మొత్తం సీట్లకు కూడా పోటీ పడొచ్చు. ఇందుకోసం విద్యార్థులు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ కౌన్సెల్సింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలి.


చ‌ద‌వండి: NEET 2021-22: నీట్ పీజీ కౌన్సెలింగ్ తేదీలు.. ఈడబ్ల్యూఎస్ కోటాను తెలుసుకోండిలా..

ఏఐక్యూ కోటా కౌన్సెలింగ్‌

  • జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. సదరు నోటిఫికేషన్‌కు అనుగుణంగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నిర్వహించే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.
  • ఇందుకోసం నోటిఫికేషన్‌కు ఎంసీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే క్యాండిడేట్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి..ఆన్‌లైన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌ చేసుకొని.. లాగిన్‌ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. 
  • అనంతరం అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి.
  • వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ పూర్తి చేయాలి. ∙ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్‌ అలాట్‌మెంట్‌ వివరాలను వెల్లడిస్తారు. 
  • తొలి రౌండ్‌లో సీట్‌ అలాట్‌మెంట్‌ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తొలి రౌండ్‌లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకపోతే.. ప్రీ ఎగ్జిట్‌ అవకాశం అందుబాటులో ఉంది. అలాంటి అభ్యర్థులు రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన విద్యార్థులు.. మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా అందుబాటులో ఉంది. 
  • ఈ ఏడాది రెండు రౌండ్లలో ఎంసీసీ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.
  • ఈ రెండు రౌండ్ల తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే.. మాప్‌–అప్‌ రౌండ్‌ పేరిట తుది కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 
  • ఆల్‌ ఇండియా కోటా ఎంసీసీ కౌన్సెలింగ్‌ సమాచారం కోసం వెబ్‌సైట్‌: https://mcc.nic.in/UGCounselling చూస్తుండాలి. 

స్టేట్‌ కోటా కౌన్సెలింగ్‌

జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేస్తాయి. తెలంగాణలో కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌
హెల్త్‌ యూనివర్సిటీలు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. దీనిద్వారా ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్‌ ఇండియా కోటాకు కేటాయించాక ఉన్న సీట్లు),ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే
విధంగా ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రైవేట్‌–బి పేరిట ఉండే 35శాతం సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లు అంటే ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా పోగా మిగిలే 50 శాతం సీట్లను కూడా హెల్త్‌ యూనివర్సిటీలే కౌన్సెలింగ్‌ విధానంలో భర్తీ చేస్తాయి.
ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్‌ యూనివర్సిటీలే చేపడతాయి.


చ‌ద‌వండి: NEET Guidance

స్టేట్‌ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్‌

రాష్ట్రాల స్థాయిలో హెల్త్‌ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్‌ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు కూడా విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా హెల్త్‌ యూనివర్సిటీల నోటిఫికేషన్‌కు అనుగుణంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలి. ఈ కౌన్సెలింగ్‌ కూడా
రౌండ్ల విధానంలో జరుగుతుంది. గత ఏడాది మూడు రౌండ్లలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈసారి కూడా అదే విధానం కొనసాగనుంది. స్టేట్‌ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి, వారికి వచ్చిన ఆల్‌ ఇండియా ర్యాంకు ఆధారంగా
ముందుగా ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్‌ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు.. నిర్దేశిత రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించి ఆన్‌లైన్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా
ఉంటుంది. 

అంతా ఆన్‌లైన్‌లోనే

హెల్త్‌ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత విద్యార్థులు నిర్దేశిత వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీ, పాస్ట్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవడం,ఆ తర్వాత నీట్‌ ర్యాంకు సహా,ఇంటర్మీడియెట్‌ వరకు అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ చేయడం తప్పనిసరి.

ఇవి సిద్ధం చేసుకోండి

నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సన్నద్ధమయ్యే విద్యార్థులు నీట్‌ ఎంట్రన్స్‌ అడ్మిట్‌ కార్డ్, నీట్‌ ర్యాంక్‌ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు మార్క్‌ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ..
స్టడీ సర్టిఫికెట్స్‌(స్థానికతను నిర్ధారించేందుకు), ఎనిమిది పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు దగ్గరపెట్టుకోవాలి.

చ‌ద‌వండి: NEET Cutoff Ranks

ఫీజులు ఎలా ఉన్నాయంటే
తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ కోర్సుల ఫీజుల వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌

  • ఎంబీబీఎస్‌ ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్‌ కళాశాలల్లో కేటగిరీ–ఎగా పేర్కొనే కన్వీనర్‌ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు.
  • ప్రైవేట్‌ ఎంబీబీఎస్‌ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటాగా పేర్కొనే కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు.
  • ప్రైవేట్‌ ఎంబీబీఎస్‌ కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు: రూ.36లక్షలు. 
  • బీడీఎస్‌ ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్‌ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్‌ కోటా సీట్లకు ఫీజు: రూ.13వేలు. 
  • ప్రైవేట్‌ బీడీఎస్‌ కళాశాలల్లో కేటగిరీ–బి మేనేజ్‌మెంట్‌ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజు.

తెలంగాణలో ఫీజులు ఇలా

ఎంబీబీఎస్‌ కళాశాలల ఫీజులు: ∙ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ఫీజు రూ.10వేలు. ∙ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీటు ఫీజు: రూ.60 వేలు. ∙ప్రైవేట్‌ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్‌మెంట్‌ కోటా) సీటు ఫీజు: రూ.11లక్షలు ∙ప్రైవేట్‌ కళాశాలల్లో
ఎన్‌ఆర్‌ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు: రూ.22 లక్షలు 
బీడీఎస్‌ కళాశాలలు ఫీజులు:  ప్రభుత్వ కళాశాలల్లో బీడీఎస్‌ ఫీజు రూ.10 వేలు. ∙ప్రైవేట్‌ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్‌ కోటా)సీటు ఫీజు: రూ.45వేలు ∙ప్రైవేట్‌ కళాశాలల్లో బి–కేటగిరీ (మేనేజ్‌మెంట్‌ కోటా)సీటు ఫీజు: రూ.4లక్షలు  ప్రైవేట్‌ కళాశాలల్లో
సి–కేటగిరీ(ఎన్‌ఆర్‌ఐ కోటా) సీటు ఫీజు: రూ.5లక్షలు

తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ కాలేజీలు, సీట్లు

ప్రస్తుతం అందుబాటులో సమాచారం ప్ర కారం–తెలుగు రాష్ట్రాల్లో  ఉన్న మెడికల్‌ కాలేజీలు, సీట్ల వివరాలు అందిస్తున్నాం. వీటిలో మార్పులుచేర్పులు జరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌– మెడికల్‌ కళాశాలలు–సీట్లు

  • 11 ఎంబీబీఎస్‌ ప్రభుత్వ కళాశాలల్లో 2,180 సీట్లు 
  • 15 ఎంబీబీఎస్‌ ప్రైవేట్, 2 మైనార్టీ కళాశాలల్లో 2,830
  • రెండు ప్రభుత్వ డెంటల్‌ కళాశాలల్లో 140 బీడీఎస్‌ సీట్లు
  • 14 ప్రైవేట్‌ డెంటల్‌ కళాశాలల్లో 1,300 బీడీఎస్‌ సీట్లు

తెలంగాణ–మెడికల్‌ కళాశాలలు–సీట్లు

  • 10 ప్రభుత్వ ఎంబీబీఎస్‌ కళాశాలల్లో 1,765 సీట్లు 
  • 23 ప్రైవేట్, మైనారిటీ ఎంబీబీఎస్‌ కళాశాలల్లో 3,350 సీట్లు 
  • ఒక ప్రభుత్వ డెంటల్‌ కళాశాలలో 100 బీడీఎస్‌ సీట్లు 
  • పది ప్రైవేట్‌ డెంటల్‌ కళాశాలల్లో 1,000 బీడీఎస్‌ సీట్లు 
  • వీటికి అదనంగా సికింద్రాబాద్‌ ఆర్మీ డెంటల్‌ కళాశాలలో ఆరు సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు.

టీఎస్‌లో మెడికల్‌ ప్రవేశాలు

 

  • ఎంబీబీఎస్, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు నోటిఫికేషన్‌ 
  • 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు 

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్‌ కోర్సులకు ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్‌ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల(జనవరి) 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ¯Œ లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్‌ జాబితా విడుదలైన తర్వాత వెబ్‌ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ http://www.knruhs.telangana.gov.in/ను సందర్శించొచ్చు.

చ‌ద‌వండి: Guest Column

Published date : 10 Jan 2022 06:36PM

Photo Stories