NEET 2021-22: నీట్ పీజీ కౌన్సెలింగ్ తేదీలు.. ఈడబ్ల్యూఎస్ కోటాను తెలుసుకోండిలా..
Sakshi Education
జనవరి 12 నుంచి నీట్– పీజీ కౌన్సెలింగ్ ఆరంభమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు.
2021–22 సంవత్సరానికి కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు జనవరి 7న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌన్సెలింగ్లో 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీం సమరి్ధంచింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా కౌన్సెలింగ్ చేపట్టేందుకు సిద్ధమైనట్లు మంత్రి తెలిపారు. గతేడాది సెపె్టంబర్లో నీట్ పీజీ పరీక్ష జరిగింది. అదేనెల్లో ఫలితాలు ప్రకటించారు. సుమారు 45వేల మెడికల్ పీజీ సీట్లను కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ను త్వరగా చేపట్టాలని డిసెంబర్ ల్లో దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు.
చదవండి:
Medical Colleges: దేశ చరిత్రలో ఒకేసారి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల నిర్మాణం
Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..
Published date : 10 Jan 2022 03:06PM