CESS: వివిధ రంగాల్లో భారీగా మానవ వనరుల కొరత.. ఏ రంగాలలో ఎంత...
Sakshi Education
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉందని, 2022లో ప్రధానంగా పది రంగాల్లో పెద్ద ఎత్తున నిపుణులు అవసరమని ఆర్ధిక, సామాజిక అధ్యయన సంస్థ (సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్) తెలిపింది.
దేశంలో నిపుణులైన మానవ వనరుల కొరత, పెరుగుతున్న నైపుణ్యాల అంతరంపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ ఇండియా ఆధారంగా సంస్థ నివేదిక రూపొందించింది.
చదవండి: త్వరలోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..
నివేదికలో ముఖ్యాంశాలు..
- ప్రధానంగా మౌలిక సదుపాయాల రంగంలో ఈ ఏడాది 10.3 కోట్ల మంది నిపుణులైన మానవ వనరులు అవసరం.
- ఆటో మొబైల్, విడిభాగాలు, భవన నిర్మాణం, ఆరోగ్య రంగం, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో నైపుణ్యాల్లో అంతరం పెరిగింది.
- ఉపాధి శిక్షణ సంస్థలకు గ్రాంట్లు అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. శిక్షణ సంస్థల పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు అందించాలి.
- పాఠ్యాంశాలు, శిక్షణ కోర్సుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.
దేశవ్యాప్తంగా 2022లో నిపుణుల కొరత అంచనా సంఖ్య కోట్లలో
రంగం |
కొరత |
మౌలిక సదుపాయాలు |
10.3 |
ఆటో అండ్ ఆటో కాంపొనెంట్స్ |
3.50 |
భవనాలు– నిర్మాణం |
3.30 |
టెక్స్‌టైల్స్ అండ్ క్లాతింగ్ |
2.62 |
రవాణా అండ్ లాజిస్టిక్స్ |
1.77 |
ఆర్గనైజ్డ్ రిటైల్ |
1.73 |
రియల్ ఎస్టేట్ సర్వీస్ |
1.40 |
హెల్త్ కేర్ |
1.27 |
ఫుడ్ ప్రాసెసింగ్ |
0.93 |
విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ |
0.58 |
Published date : 05 Mar 2022 03:28PM