Skip to main content

SCCL Clerk Notification: సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

 177 Junior Assistant posts in Singareni
177 Junior Assistant posts in Singareni
  • 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 (క్లర్కు) పోస్టుల భర్తీకి గురువారం సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్స్‌/ ఐటీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్‌ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌లో డిగ్రీ/ డిప్లొమా/6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు చేసిన వారు అర్హులు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. ఈ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్‌ (ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలకు చెందిన) అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్‌ రిజర్వుడ్‌ కోటా కింద ఓపెన్‌ టు ఆల్‌ (తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థుల)కు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తామని సంస్థ డైరెక్టర్‌  శ్రీ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. ఈ నెల 20 నుంచి జూలై 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా www.scclmines.com పోర్టల్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

Also read: Good News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

Published date : 17 Jun 2022 04:15PM

Photo Stories