Good News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
Sakshi Education

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు కూడా. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది.
చదవండి:
Published date : 16 Jun 2022 08:04PM