ఏఎన్ యూ: ఆచార్య నాగార్జున యూనివ ర్సిటీలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ప్రఖ్యాత సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు.
22, 23 తేదీల్లో మెగా జాబ్ మేళా
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లపై యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అతిథి అధ్యా పకులతో జూన్ 20న జరిగిన సమావేశంలో వీసీ ప్రసంగిస్తూ జూన్ 22, 23 తేదీలలో ఏఎన్ యూలో జాబ్ మేళా నిర్వహిస్తు న్నామన్నారు. జాబ్ మేళా విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. డిగ్రీ, పీజీ, ఐటీ విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.
వార్షిక వేతనం గరిష్టంగా రూ.8.5 లక్షల వరకు పొందే అవకాశం ఉందన్నారు. ఉద్యోగ మేళాలో దేశవ్యాప్తంగా వందకుపైగా సంస్థలు పాల్గొని అర్హులకు తమ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయన్నారు. ఇంట ర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఆయా సంస్థలు ఎంపిక చేసుకుంటాయన్నారు.